విమానంలోని బాత్ రూమ్ ను ఎలా క్లీన్ చేస్తారో తెలుసా?

-

విమానం అంటే ఒకప్పుడు చాలా క్రేజ్ ఉండేది.. విమానం ఎక్కాడు అంటే అతడిని గ్రేట్ గా చూస్తారు..ఆ విమానం లో ఎలా ఉంటుంది.సినిమాలో చూపించిన విధంగా ఉంటుందా… ఇలా అందరికి డౌట్స్ వస్తుంటాయి.. ముఖ్యంగా ఆకాశంలో ఎగిరే విమానంలో మనం మూత్ర విసర్జన చేస్తే అది కింద పడుతుందా..అక్కడ నీళ్ళు పోస్తే కిందకు ఎలా వస్తాయి..దానిని ఎలా శుభ్రం చేస్తారు.ఇలాంటి సందెహాలు రావడం సహజం..అసలు విమానంను ఎలా క్లీన్ చేస్తారు అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

నిజానికి విమానంలో నుంచి వ్యర్దాలు పొరపాటున అయినా బయటకు లీక్ అయితే ఆ విమాన సంస్థకు భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశలు కూడా ఉన్నాయి. అందుకే అలాంటి పరిస్థితి కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. అందుకే విమానంలో ప్రయాణం చేసేవారు టాయిలెట్స్ విషయంలో ఎటువంటి భయాలు పెట్టుకోవలిసిన పనిలేదు. సాధారణంగా మనం ఇళ్లల్లో ఉపయోగించే బాత్రూమ్స్, టాయిలెట్స్ లాగా అక్కడ ఉండవు.. అంతా వ్యాక్యుమ్స్ ఉంటాయి.టాయిలెట్ లోని వ్యర్థలను వాక్యూమ్ ద్వారా లాగేసుకుని విమానంలోని వ్యర్దాల ట్యాంక్ లోకి పంపించేస్తుంది.

 

విమానం ఎప్పుడూ అయితే ఎయిర్ పోర్టుకు వస్తుందో అప్పుడు వెంటనే ట్యాంకర్ల ద్వారా ఆ వ్యర్థాలను బయటకు తీస్తారు.ఇలా వాక్యూమ్ సిస్టమ్ ఎందుకు వాడతారు. అంటే విమాన ట్యాంకర్లలో ఎక్కువగా నీరు తీసుకువెళ్తే ఇంధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. అందుకే తక్కువ నీటిని తీసుకువెళ్లి వ్యాక్యూమ్ సిస్టంను ఉపయోగించి వ్యర్ధాలను శుభ్రం చేస్తారు.బాత్రూంలో ఫ్లష్ ట్యాంక్ లోని నీటిలో ఒక నీలి రంగులో ఉండే లిక్విల్డ్ ను కలిపుతారు. ఎప్పుడయితే ఫ్లష్ బటన్ నొక్కుతామో వెంటనే అది క్లీన్ చేయడం మొదలుపెడుతుంది. ఒకవేళ వాక్యూమ్ సిస్టం బదులు నీళ్ళను వాడితే అది వ్యర్దాల ట్యాంక్ లోకి వెళ్లి లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది..అందుకే అన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version