కేవలం మూడు పదార్థాలతోనే ఐస్ క్రీం చేసుకోవచ్చు. సాధారణంగా మనం బయట ఐస్ క్రీమ్ తింటూ ఉంటాం. ఇంట్లో ఐస్ క్రీమ్ చేయాలంటే నిజంగా పెద్ద పనే. కానీ ఇప్పుడు మూడు పదార్థాల తో చేసిన ఐస్ క్రీమ్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఇది ఇప్పుడు బాగా వైరల్ అయి పోతోంది.
పింక్ ఫాండెంట్, పైన బిస్కెట్స్ అలానే కొంచెం రాస్బెర్రీ జామ్ మరియు కొబ్బరిని వేసుకోవచ్చు. నిజంగా ఈ యమ్మీ ఐస్ క్రీమ్ ని ఈజీగా ఇంట్లో చేసేయొచ్చు. అయితే ఈ మూడు పదార్థాలతో ఆమె ఐస్ క్రీమ్ ఎలా చేసింది అనేది ఇప్పుడు చూద్దాం..!
అయితే దీని కోసం ముందుగా క్రీమ్ తీసుకొని విప్ చేయాలి. అది బాగా మంచిగ వచ్చే వరకూ విప్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత అర కప్పు కండెన్స్డ్ మిల్క్ వెయ్యాలి. ఇప్పుడు బాగా మళ్ళీ విప్ చెయ్యాలి. ఇప్పుడు స్మూత్ టెస్ట్చర్ వచ్చిన తర్వాత ఆరు మిస్డ్ వోవో బిస్కట్స్ ని కట్ చేసి క్రీం, మిల్క్ ఉన్న బౌల్ లో వెయ్యాలి.
ఆ తర్వాత క్రీం ని అందులో వేసి ఒక స్క్వేర్ కంటైనర్ లో కి మార్చాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా బిస్కెట్ ముక్కలు కూడా పైన వెయ్యాలి. నాలుగు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టి తీసేస్తే మంచి టేస్టీ ఐస్క్రీమ్ వచ్చేస్తుంది. మరి మీరు కూడా ఈ రోజే ఇంట్లో ట్రై చేయండి. ఎంతో ఈజీగా దీనిని ఎవరైనా చేసుకోవచ్చు.