కుంకుమ పువ్వు పాలల్లో కలుపుకొని తాగితే పిల్లలు ఎర్రగా పుడతారా?

-

అవునా.. పుడతారా.. పిల్లలు ఎర్రగా పుడతారా? కుంకుమ పువ్వు పాలల్లో కలుపుకొని తాగితే నిజంగానే పిల్లలు ఎర్రగా పుడతారా? ఒకవేళ నిజంగానే కుంకుమ పువ్వు వల్ల పిల్లలు ఎర్రగా పుడితే.. చాలామంది పిల్లలు ఎందుకు నల్లగా ఉంటున్నారు. అంటే వాళ్లు గర్భిణీగా ఉన్నప్పుడు కుంకుమ పువ్వు పాలల్లో కలుపుకొని తాగలేదేమో? ఒకవేళ తాగినా పిల్లలు నల్లగానే పుడితే… అప్పుడేం చేయాలి. అసలు దీంట్లో నిజమెంత… అబద్ధమెంత… తెలుసుకుందాం పదండి…

అసలు పిల్లల చర్మం రంగుకు, కుంకుమ పువ్వుకు ఏమాత్రం సంబంధం లేదట. అసలు పుట్టే పిల్లల రంగు కుంకుమ పువ్వు వల్ల మారదట. పిల్లల రంగు అనేది తల్లిదండ్రుల జీన్స్ ద్వారా వస్తుంది. తల్లిదండ్రుల చర్మం రంగు ప్రకారం… వారి జీన్స్ లో ఉంటే మెలనో సైట్స్ నుంచి వచ్చే మెలనిన్ అనే దాని మీద పిల్లల రంగు ఆధారపడి ఉంటుంది.

అర్థం కాలేదా? ఏం లేదు.. తల్లిదండ్రుల జీన్స్ నుంచి మెలనిన్ అనే ఓ హార్మోన్ రిలీజవుతుంది. ఆ హార్మోన్ ఎక్కువగా రిలీజయితే పిల్లలు నల్లగా పుడతారు… తక్కువగా రిలీజయితే పిల్లలు తెల్లగా(ఎర్రగా) పుడతారు. అంతే కాదు.. చర్మం మీద సూర్యుడి కిరణాలు ఎక్కువగా పడితే.. మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందట. దీంతో మనుషులు నల్ల బడుతారట. అంటే… మనుషులు నల్లబడటానికి సూర్యరశ్మి కూడా ఓ కారణం అన్నమాట. సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడటం కోసమే మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. నలుపు, తెలుపు అనేది మెలనిన్ మీద ఆధారపడి ఉంటుంది కానీ… కుంకుమ పువ్వు మీద కాదు అని అర్థమయిందా?

Read more RELATED
Recommended to you

Exit mobile version