గిన్నెలు కడగడానికి సబ్బు లేకపోతే ఇలా చెయ్యండి.. తెల్లగా వచ్చేస్తాయి..!

-

చాలా మంది వంటింట్లో చిన్న చిన్న చిట్కాలని పాటిస్తూ ఉంటారు. చిన్న చిన్న చిట్కాలని పాటిస్తే మన పనులు తేలిగ్గా పూర్తయిపోతాయి. పైగా పని చేయడానికి పెద్దగా మనం కష్టపడక్కర్లేదు కూడా. మంచి రుచితో వంట రావాలంటే ఖచ్చితంగా పాత శుభ్రం ఉండాలి పాత్రలని శుభ్రం చేసుకోకుండా దానిలో ఎంత రుచికరమైన వంట చేసినా కూడా అది వ్యర్థమే. మనం పాత్రలను క్లీన్ చేసేటప్పుడు సోప్ ని వాడుతూ ఉంటాము.

డిష్ వాష్ బార్ అయిపోయి మీ ఇంట్లో సామాన్లు తోవడం కష్టంగా ఉంటుంటే అప్పటికప్పుడు మీరు ఈజీగా పాత్రలని శుభ్రం చేసుకోవడానికి ఇలా చేయొచ్చు. డిష్ వాషింగ్ బార్ కి బదులుగా మీరు వీటిని ఉపయోగించవచ్చు అప్పుడు కచ్చితంగా మీ పని ఈజీ అయిపోవడమే కాదు సబ్బు కోసం ఎదురు చూడక్కర్లేదు బేకింగ్ సోడా ఇందుకు బాగా పనిచేస్తుంది.

బేకింగ్ సోడా పాత్రలని ఈజీగా క్లీన్ చేస్తుంది. పాత్రలని మీరు గోరువెచ్చని నీటితో కడిగి దానిమీద బేకింగ్ సోడా ని జల్లి అయిదు నుండి పది నిమిషాలు అలా వదిలేసి తర్వాత స్క్రబ్ చేయండి ఈజీగా మీ పాత్రలు తెల్లగా వచ్చేస్తాయి. నిమ్మరసం కూడా ఇందుకు బాగా పనిచేస్తుంది. నిమ్మకాయ పాత్రలని బాగా క్లీన్ చేస్తుంది మంచి క్లెన్సర్ లాగ ఇది పనిచేస్తుంది బేకింగ్ సోడా నిమ్మకాయ మిశ్రమాన్ని మీరు పాత్రను క్లీన్ చేయడానికి వాడుకోవచ్చు. చెక్క బుడదని కూడా వాడుకోవచ్చు ఈ బూడిదని తీసుకొని మీరు మురికి పాత్రల మీద రుద్దితే ఈజీగా తెల్లగా వచ్చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news