లైబ్రరీల్లో ఆ గ్రంథాల‌యం గురించి తెలిస్తే షాక్‌.. దొంగ‌ల్ని ఇట్టే ప‌ట్టేస్తుందంట‌…!

-

లైబ్రరీల్లో ( library ) ఎన్నో రకాల పుస్తకాలు ఉంటాయి. అవి మనకు చాలా విజ్ఞానాన్ని, అనేక విషయాలపై అవగాహనను అందిస్తాయి. అంతేకాకుండా వివిధ రకాలు ఉద్యోగాలను సాధించడానికి ప్రిపేర్ అయ్యే యువత, చదువుకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి విద్యార్థులు, న్యూస్ పేపర్లు లేదా ఇతర పుస్తకాల కోసం సాధారణ ప్రజలు కూడా లైబ్రరీకి వస్తారు. అయితే కొందరు లైబ్రరీకి చదువుకోవడానికి వచ్చి, పుస్తకాలను దొంగతనం చేస్తుంటారు.

 

library | లైబ్రరీ

అయితే లైబ్రరీల్లో విలువైన పుస్తకాలు దొంగతనానికి గురవుతుండటంతో గ్రంథాలయ నిర్వాహకులు, దొంగతనాలకు చెక్ పెట్టేందుకు కొత్త టెక్నాలజీని అందుబాటులోని తీసుకుని వచ్చారు. ముందుగా పూణేలోని ఒక లైబ్రరీలో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది.

పూణేలోని లక్ష్మి రోడ్డులో ఉన్న ఈ లైబ్రరీ పేరు పూణే నగర్ వచన్ మందిర్. దీంట్లో లక్ష వరకూ పుస్తకాలు ఉండగా, 20 వేల పుస్తకాలు చోరీకి గురయ్యాయి. లైబ్రరీ కూడా చాలా విశాలంగా ఉండటంతో దొంగతనం చేసిన వారిని పట్టుకోవడం చాలా కష్టంగా మారింది. చోరీ చేసిన వారిని పట్టుకోవడానికి నిర్వాహకులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీని అందుబాటులోకి తీసుకుని వచ్చారు. RFID అనేది ట్యాగ్‌లు, రీడర్‌లతో పని చేసే వైర్ లెస్ టెక్నాలజీ. ఒక వ్యక్తి లోపలకి వచ్చినప్పుడు అతడు తీసుకున్న పుస్తకాన్ని నమోదు చేస్తుంది, ఆ తర్వాత అతను తిరిగి ఇచ్చిన తర్వాతే ఎగ్జిట్ గేట్ ఓపెన్ అవుతుంది.

ఒక వేళ నమోదు చేయని పుస్తకాలను లేదా ఎక్కువ పుస్తకాలను తీసుకెళ్లడానికి ప్రయత్నించినా బీప్ శబ్దం చేస్తుంది. ఈ విధంగా పుస్తకాలు దొంగతనం కాకుండా ఈ టెక్నాలజీ నిరోధిస్తుంది. ఈ టెక్నాలజీ చాలా బాగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version