కులగణన విషయంలో కొందరూ అతి తెలివితో లేదా వారి గుర్తింపు కోసమో ఈ లెక్కలు తప్పు అనేలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలపై సీఎం ఫైర్ అయ్యారు. బీసీలకు న్యాయం చేయాలని కులగణన సర్వేను ఏదో రకంగా పట్టాలెక్కించేందుకు తల బద్దలు కొట్టుకుంటుంటే.. మళ్లీ తనపైనే రాళ్లు రువ్వే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కులగణన సర్వే చేయని వ్యక్తి హాయిగా ఫామ్ హౌస్ లో పడుకున్నాయన మంచోడు అయ్యారు. బీసీలంటే లెక్కనే చేయని తండ్రి, కొడుకు, అల్లుడు మంచోళ్లు అయ్యారు.
వాళ్ల సంఘాల మీటింగ్ లు పెడితే మనోల్లు వెల్లి కూర్చుంటున్నారు. ఇంత కష్టపడి కులగణన సర్వే చేసినా రేవంత్ రెడ్డిని విలన్ ను చేస్తున్నారు. కులగణన వద్దు అనేవాళ్లు ఎలాగో విలన్లే మీ కోసం ప్రయత్నిస్తున్న నన్ను కూడా తప్పు పడితే నష్టం మీకా..? నీకా..? అని ప్రశ్నించారు. మీరు అండగా నిలబడకపోతే ఎలా ముందుకు పడుతుందని నిలదీశారు. కులగణన సర్వేను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ బీసీ నేతలదేనని స్పష్టం చేశారు. అంతా తానే చూసుకుంటానని అనుకోవడం సరికాదన్నారు.