రోజుకు రూ. 50లతో ఏకంగా కోటి రూపాయలు..?

-

ఈ రోజుల్లో దేనికీ గ్యారంటీ లేదు.. ఇంట్లోంచి బయటకు వెళ్లిన మనిషి.. మళ్లీ ఇంటికి క్షేమంగా వస్తాడన్న నమ్మకం లేదు. రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, బోటు ప్రమాదాలు.. హత్యలు, దోపిడీలు.. ఇలా సమాజంలో ప్రాణాలకు భద్రత అన్నదే కరవైంది. మరి ఇలాంటి సమయంలో ఇంట్లో సంపాదించే వ్యక్తికి భీమా లేకపోతే ఆ కుటుంబం రోడ్డున పడాల్సిందే.

భీమా అవసరం తప్పనిసరి.. కానీ ఈ భీమా ఎంతకు చేయించుకోవాలి.. దీనికో సింపుల్ సూత్రం ఉంది. ఇంటిని పోషించేవారి ఏడాది ఆదాయానికి పది రెట్లు కనీసం బీమా తీసుకోవాలి. కానీ అంత ఎక్కువ మొత్తానికి బీమా చేయాలంటే.. నెలకు కట్టాల్సిన ఈఎంఐ కూడా గూబలదిరిపోతాయి.

మరి తక్కువ మొత్తం ప్రీమియం కట్టించుకుని.. ఎక్కువ మొత్తానికి బీమా ఇచ్చే పాలసీలు లేవా.. అంటే ఉంటాయి.. అవే టర్మ్ పాలసీలు.. అంటే ఇవి అచ్చమైన బీమా పాలసీలన్నమాట.. మనిషికి ఏమైనా జరిగితేనే.. బీమా సొమ్ము వస్తుంది. లేకపోతే.. మనం కట్టిన సొమ్ము వెనక్కిరాదు.. కానీ ఇవి చాలా తక్కువ మొత్తంతో ఎక్కువ బీమా ఇస్తాయి.

నిజం చెప్పాలంటే.. ప్రతి వ్యక్తి ఈ టర్మ్ పాలసీ ఒక్కటైనా తీసుకోవాలి. తాజాగా ఎల్‌ఐసీ ఓ ఆన్ లైన్ టర్మ్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు టెక్ టర్మ్ ప్లాన్. ఇది లైఫ్ కవర్ పాలసీ. ఈ పాలసీ ద్వారా నెలకు దాదాపు 1500రూపాయలు కడితే చాలు.. ఆ వ్యక్తి మరణిస్తే కుటుంబానికి ఏకంగా కోటి రూపాయలు అందుతాయి.

18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. మనల్ని ప్రేమించే మన కుటుంబ సభ్యుల కోసం.. వారి భద్రత కోసం నెలకు రూ. 1500 ఖర్చు చేయలేమా..? అంటే రోజుకు రూ. 50 అన్నమాట. బావుంది కదూ.

Read more RELATED
Recommended to you

Latest news