inspirational ఆ “మహిళా ఎన్నారై” మరణం తరువాత కూడా జీవించింది…!!!

-

అహ్మదాబాద్ కి చెందిన షీలా దేశాయ్ అనే మహిళ ఎన్నారై ఎన్నో ఏళ్ళ క్రితమే అమెరికాలోని సౌత్ కరోలినాలోని  గ్రీన్ ఫుడ్ లో  స్థిరపడింది. అమెరికాలో షీలా ఫ్యామిలీకి స్థానికంగా సొంత హోటల్ కూడా ఉంది. అయితే భందువుల ఇంట్లో పెళ్లి అవ్వడంతో నవంబర్ 21 వ తేదీన గుజరాత్ లోని ఓ ప్రాంతానికి వచ్చిన షీలా షాపింగ్ కోసం మోటార్ వెహికల్ లో వెళ్తున్న క్రమంలో షీలా ప్రమాదానికి గురయ్యింది. దాంతో

హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాలు ఆమెని బ్రతికించాలని విశ్వప్రయత్నం చేసినా ఆమె బ్రెయిన్ డెడ్ అవ్వడం కారణంగా ఆమె మరణించారు. ఈ క్రమంలోనే ఓ స్వచ్చంద సంస్థ ప్రతినిధి నీలేష్, షీలా కుటుంభ సభ్యులని అవయవదానం గురించి వాకబు చేశారు. ఆ సమయంలోనే ఆమె డ్రైవింగ్ లైసెన్స్ పూర్తీ చేసే సమయంలో అవయవదానం గురించి అసహజ మరణం జరిగితే తన అవయవాలు దానం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొందని గుర్తించారు.

 

షీలా 2018 మే నెలలో కరోలినా లో డ్రైవింగ్ లైసెన్స్ పొందే సమయంలో అవయవదానం గురించి అవగాహనతో ఉండేదని, ఆ పరిస్థితిలో అప్పటి లైసెన్స్ పత్రంలో ఆమె తన సహజ మరణం జరిగితే అవయవాలు తీసుకోవచ్చని పేర్కొందని భంధువులు కూడా తెలిపారు. దాంతో ఆమె మరణం తరువాత వైద్యులు ఆమె కళ్ళు, కిడ్నీ ,లివర్ లను అవసరం అయినటువంటి ఐదుగురికి అమర్చి కొత్త జీవితాలు ఇచ్చారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news