భూమి లోపల 17 అంతస్తుల హోటల్… అది ఎక్కడో తెలుసా…?

-

Inside China's Swanky Hotel Built In A Pit, With Suites Below Water Level

చైనా అంటేనే తెలుసు కదా. కొత్త కొత్త ఆవిష్కరణలు, అద్భుతాలు.. ఇలా వింతలు, వినూత్నాలను ఆవిష్కరిస్తూ ప్రపంచానికే సవాల్ విసురుతుంటుంది. తాజాగా భూమి లోపల అంటే భూగర్భంలో ఓ హోటల్ కట్టి ఔరా అనిపించింది. అది కూడా 17 అంతస్తుల బిల్డింగ్ అది. 290 అడుగుల లోతు ఉన్న పెద్ద గుంతలో ఈ హోటల్‌ను నిర్మించారు. అది కూడా వాడకుండా వదిలేసిన క్వారీ. పైన చూస్తున్నారుగా ఫోటో. అదే.. హోటల్. చూశారుగా.. ఎలా ఉందో. ఈ హోటల్ నిర్మించడానికి ఇంజినీర్లకు తల ప్రాణం తొకకొచ్చిందట. ఆ హోటల్ పేరు ఇంటర్ కాంటినెంటల్ షాంఘై వండర్ లాండ్. ఆ హోటల్‌లో మొత్తం 366 రూములు ఉన్నాయట. ఒక రోజు ఆ హోటల్‌లో ఉండటానికి 490 డాలర్లు చెల్లించాలి. వాటర్ లేవల్‌కు కింద కూడా ఒక ఫ్లోర్ ఉంటుందట.

Inside China's Swanky Hotel Built In A Pit, With Suites Below Water Level

2013లో ఈ హోటల్ నిర్మాణానికి ముందు… భారీ వర్షాల వల్ల భారీ గొయ్యి మొత్తం నీళ్లతో నిండిపోయిందట. దీంతో వరదలు వచ్చినప్పుడు ఆ నీటిని ఈ గుంతలోపలికి వెళ్లకుండా అడ్డుకోవడానికి ఇంజినీర్లు చాలా ప్రయత్నాలు చేశారట. గుంతలోకి వరద నీళ్లు వెళ్లకుండా ఆపాక.. అప్పుడు హోటల్ నిర్మాణం ప్రారంభించారట. షాంఘై నుంచి ఓ గంట ప్రయాణిస్తే ఈ హోటల్‌కు చేరుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news