పెనం మురికిగా ఉందా…? ఇలా చేస్తే మాడిపోయిన పెనం కూడా క్షణాల్లో తెల్లగా వచ్చేస్తుంది..!

-

మనం రోజు ఉపయోగించే సామాన్లు మురికిగా తయారవుతూ ఉంటాయి వాటిని క్లీన్ చేసేందుకు ఎంతో శ్రమ పడాల్సి వుంది. పైగా శుభ్రంగా కూడా రావు. పరోటాలు, రోటీలు చేసుకోవడానికి మనం పెనాన్ని వాడుతూ ఉంటాము. పెనం శుభ్రంగా లేకపోతే పరోటాలు కూడా మాడిపోయినట్లు మసిగా కనబడుతూ ఉంటాయి. మీ పెనం శుభ్రంగా మారాలంటే ఈ చిట్కాలని ట్రై చేయండి. దీని కోసం ఎక్కువ శ్రమ పడక్కర్లేదు పైగా సమయం కూడా వృధా కాదు. ఈజీగా క్షణాల్లో మీరు మీ పెనాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఐరన్ పెనాన్ని ఈజీగా శుభ్రం చేసుకోవడానికి ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి మరి ఇక వాటిని ఫాలో అయిపోండి.

ముందు మీ పెనం మీద నీళ్లు వేయండి నీళ్లు వేడిగా ఉండేటట్టు చూసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేయండి. అయితే వేడి వేడి పెనాన్ని శుభ్రం చెయ్యద్దు. పెనం బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ ని మీరు ఫాలో అవ్వండి. ఒకటి లేదా రెండు టీ స్పూన్లు బేకింగ్ సోడా ని నీళ్లలో వేసి పేస్ట్ మాదిరి చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ ని పెనం మీద వేసి రుద్దండి.

ఐదు నుండి 15 నిమిషాల పాటు అలా వదిలేసి ఇప్పుడు రెండు మూడు స్పూన్లు హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఒక బౌల్ లో వేసి స్క్రబ్ ని ముంచి దాన్ని స్క్రబ్ తో రుద్దండి ఫైనల్ గా పెనాన్ని క్లీన్ చేసేసుకోండి. తర్వాత మీరు కొంచెం బేకింగ్ సోడా ని క్లీన్ చేయండి. లో ఫ్లేమ్ లో పెనాన్ని హీట్ చేసి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పెనాన్ని చల్లారనివ్వండి. స్పాంజ్ ని ఉపయోగించి ఇప్పుడు మళ్లీ ఒకసారి రుద్దండి. నీళ్లతో కడిగేసి క్లాత్ తో తుడిచేయండి ఇలా చేస్తే మాడిపోయిన పెనం కూడా మళ్లీ బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version