లక్‌ అంటే ఇదేరా.! రూ.6 పెట్టి లాటరీ టికెట్‌ కొంటే.. రూ. కోటి వచ్చాయ్..!

-

ఉన్నట్టుండి డబ్బులొస్తే..ఎంట్రా లాటరీ టికెట్‌ ఏమైనా తగిలిందా అని అడుగుతాం.. అసలు నిజంగా లాటరీ టికెట్‌ తగిలి మనకు డబ్బులొస్తే.. ఇవన్నీ అట్టిముచ్చట్లే అనుకుంటారేమో.. ఈ మధ్య ఊహించని విధంగా రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. లాటరీ టికెట్‌ తగిలి ఫేట్‌ మార్చేసుకుంటున్నారు. తాజాగా పంజాబ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ ఆరు రూపాయలతో లాటరీ టికెట్‌ కొన్నాడు..కోటీశ్వరుడు అయ్యాడు. లక్ష్మీదేవి కరుణ ఉంటే పైసలు ఎలా అయినా వస్తాయంటే ఇదేనేమో..!
పంజాబ్‌ లూథియానాలో 6 రూపాయల టిక్కెట్‌తో ఓ కానిస్టేబుల్ కోటీశ్వరుడు అయిపోయాడు. కుల్దీప్ సింగ్ ఫిరోజ్‌పూర్ క్యూఆర్‌టీ (క్విక్ రెస్పాన్స్ టీమ్)లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నా కుల్దీప్ సింగ్ తన ఉద్యోగ నిమిత్తం తరచూ లూథియానాకు వెళ్లేవారు. అలా వెళ్లినప్పుడల్లా అక్కడి రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండే ఓ ఏజెంట్ నుంచి నాగాలాండ్ లాటరీ సంస్థకు చెందిన లాటరీ టికెట్ కొనేవాడట.. ఇలాకొన్న ఓ లాటరీ టికెట్ కోటి రూపాయలు తగిలాయి. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన కుల్‌దీప్ సింగ్ తన కుమారుడ్ని చదువుకు లాటరీ డబ్బును ఉపయోగిస్తానని తెలిపాడు.
తనకు లాటరీ టికెట్ కొనే అలవాటు లేదని కుల్దీప్ అన్నారు. తల్లి సలహా మేరకే తాను ఆరు నెలల క్రితం లాటరీ టికెట్ కొన్నానని కుల్దీప్ సింగ్ వెల్లడించాడు. నాలుగు నెలల క్రితం కూడా లాటరీ ద్వారా  రూ.6,000 గెలుచుకున్నాడట.. ఇప్పుడు కోటి రూపాయలు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని కుల్దీప్‌ తెలిపారు. తనకు వచ్చిన డబ్బులో కొంత మొత్తంతో.. పేద పిల్లలకు సహాయం చేస్తానని, కొంత డబ్బును గురుద్వారాలకు అందజేస్తానని కుల్దీప్ సింగ్ తెలిపారు.
అలా మన కుల్దీప్ రూ. కోటీశ్వరుడు అయ్యాడు. అదృష్టం మన జీవితంలో కూడా ఎప్పుడైన ఎంట్రీ ఇవ్వొచ్చు. చాలామందికి ఇలా లాటరీ టికెట్‌ కొనే అలవాటు ఉంటుంది. కానీ మనకు ఎప్పుడు డబ్బులు వచ్చి ఉండవు. మీకు ఆసక్తి ఉంటే ఎప్పుడూ కొంటూనే ఉంటే..ఏదో ఒక రోజు తగలొచ్చు.. అలా అనీ ఉన్న డబ్బు అంతా లాటరీ టికెట్‌ కొంటానికే వేస్ట్‌ చేయకూడదు. ఏదో ఆశ చావనంత వరకూ నమ్మకం పోయేవరకూ ట్రే చేయొచ్చు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version