ఇవి తల వెంట్రుకలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. మరి ఏంటవి?

-

అవి తల వెంట్రుకల్లా కనిపిస్తున్నాయి కదా. కానీ.. అవి వెంట్రుకలు కానే కాదు. మరేంటివి అంటారా? అవి వెంట్రుకలేమో అని కదిలించారో అంతే. అప్పుడే మీకు అవి తల వెంట్రుకలు కావని అర్థమవుతుంది. వాటిని కదిపితే చాలు.. అందులో నుంచి కొన్ని జీవులు బయటికి వస్తాయి. అవి సాలీడుల్లా ఉంటాయి. ఈ జీవులను క్లస్టర్ ఆఫ్ డాడీ లాంగ్ లెగ్స్ లేదా హార్వెస్ట్ మెన్ అని పిలుస్తారు.

బ్లాక్ కలర్ లో ఉండే ఈ సాలీడులు ఎక్కడికి వెళ్లినా గుంపు గుంపుగా వెళ్తాయి. వాటి కాళ్లు నల్లగా ఉండటంతో వాటి గుంపులు ఎక్కడున్నా.. అవి తల వెంట్రుకల్లా కనిపిస్తాయి. ఈ రకం జాతి సాలీడులు ఎక్కువగా మెక్సికో, స్కాట్ లాండ్ లో ఉంటాయి.

అయితే.. వీటి వల్ల ఏం ప్రమాదం ఉండదట. ఇవి అంత విషపూరితమైనవి కాదు. కాకపోతే ఇవి మిగితా సాలీడుల్లా గూడులు కట్టలేవు. తమను తాము రక్షించుకోవడం కోసమే ఇలా గుంపులు గుంపులుగా వెళ్తాయి. గుంపులు గుంపులుగా ఒకే చోట ఉంటాయి. ఆ సాలీడులు ఎలా గుంపుగా ఉంటాయో.. వాటిని కదిస్తే.. ఎలా బయటికి వస్తాయో ఈ వీడియోలో చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version