ఇక సోష‌ల్ మీడియాకు ఆధార్ లింక్ చేయాల్సిందే..

-

ప్రస్తుతం మొబైల్ సిమ్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్ వరకు అన్నిటికీ ఆధార్‌తో లింక్ తప్పనిసరంటుంది ప్రభుత్వం. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు లాంటి అన్ని ఇంపార్టెంట్ అవసరాలకు ఆధార్ లింక్ చేసేశారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్‌ అనుసంధానించేందుకు రంగం సిద్ధమైంది. సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్ వివరాలను అనుసంధానించడానికి సంబంధించి చట్టాలు, నియమాలు, మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నదీ, లేనిదీ ఈ నెల 24 లోగా తెలపాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.

జస్టిస్ దీపక్ మిశ్రా గుప్తా, అనిరుద్ధ బోస్ సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం ఫేస్‌బుక్ ఇంక్ వేసిన పిటిషన్‌ను విచారించింది. వ్యక్తిగత ప్రొఫైల్స్‌కు ఆధార్‌ను అనుసంధానించడంపై దాఖలై వివిధ హైకోర్టుల వద్ద పెండింగులో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ ఫేస్‌బుక్ ఇంక్ బదిలీ పిటిషన్ దాఖలు చేసింది. మద్రాస్ హైకోర్టులో రెండు, బొంబాయి, మధ్యప్రదేశ్ హైకోర్టులలో ఒక్కొక్కటి పిటిషన్లు దాఖలు చేసినట్లు ఫేస్ బుక్ సుప్రీంకోర్టుకు తెలిపింది. మూడు హైకోర్టులలోని అన్ని అభ్యర్ధనలు సోషల్ మీడియా ఖాతాలను ప్రామాణీకరించడానికి ఆధార్ లేదా ఇతర ప్రభుత్వ – గుర్తింపు రుజువులను తప్పనిసరి చేయాలని ప్రకటించాయి.


సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో ఆధార్‌ను అనుసంధానించాలని కోరుతూ ప్రార్థనపై విరుద్ధమైన నిర్ణయాలు భారతదేశమంతటా ఉపయోగించిన ప్లాట్‌ఫామ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయని, ఈ దశలో విచారణను కొనసాగించకపోతే కోలుకోలేని నష్టాన్ని చవిచూడవచ్చని ఫేస్‌బుక్ తెలిపింది. సాధారణ ప్రశ్నలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 మరియు ఆధార్ అండ్ అదర్ లాస్ (సవరణ) ఆర్డినెన్స్, 2019 తో సహా ముఖ్యమైన కేంద్ర శాసనాల వివరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని పిటిషన్లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news