గూడ్స్ రైలులో ప్రేమ జంట… అసలు ఏం జరిగింది…?

-

ఒక పక్క కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్నారు. వలస కార్మికుల కోసం ప్రత్యేక రైలు సర్వీసులు నడుస్తున్నాయి. కోట్ల మంది ప్రజలు ఎక్కడి వారు అక్కడ ఆగిపోయారు. ఎవరూ కూడా ఒక చోట నుంచి ఒక చోటకు ప్రయాణం చేయడానికి కూడా రవాణా సౌకర్యాలు లేవు. గూడ్స్ రైలు సర్వీసులు మినహా ఏ ఒక్క సర్వీసు కూడా ఇప్పుడు అందుబాటులో లేదు.

ఈ తరుణంలో ఒక ప్రేమ జంట చేసిన పని దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వారు ఇద్దరూ మహారాష్ట్రలోని నాసిక్ వెళ్ళడానికి యూపీలోని ఆగ్రా నుండి రహస్యంగా వెళ్ళాలి అని చూసారు. గూడ్స్ రైలు రాజస్థాన్ కి చేరుకున్న తర్వాత వాళ్ళు ఇద్దరూ రైల్లో దాక్కున్నారు అని గుర్తించారు. ఢిల్లీ-ముంబై రైల్వే లైన్‌లోని హిందౌన్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక క్రాసింగ్ వద్ద క్యారేజ్ కంపార్ట్‌మెంట్‌లో వాళ్ళు కూర్చున్నారు అని గేటు మాన్ ఒకరు గుర్తించారు.

వెంట‌నే అత‌ను అప్రమత్తమై హిందౌన్‌ సిటీ రైల్వే స్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇవ్వడంతో స్టేషన్ మాస్టర్ గూడ్స్ రైలుని ఆపేశారు. జీఆర్పీ సిబ్బంది సహాయంతో ప్రేమికుల జంటను గూడ్స్ రైలులో నుంచి కిందకు దింపి… గంగాపూర్ సిటీ జీఆర్పీ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో వారిని గంగాపూర్ నగరానికి తీసుకొచ్చి… విచారించారు. యూపీలోని బర్నాల్ ప్రహ్లాద్పూర్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని మెయిన్‌పురిలో నివాసం ఉండే వారు అని గుర్తించారు. తల్లి తండ్రులను తీసుకొచ్చి వారిని అప్పగిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news