కొన్ని కొన్ని కష్టాలు పైకి చెప్పలేము అనేది వాస్తవం. మనసులో బాధ పడే వాళ్ళు ఉంటారు కొందరు పైకి చెప్పేసుకుని ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు లాక్ డౌన్ అమలు జరుగుతుంది. ఈ లాక్ డౌన్ లో సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక ఇదే సమయంలో మరికొంత మంది బాధలు కూడా బయటకు చెప్పుకోలేనివి ఉన్నాయి.
వాళ్ళే ప్రేమికులు, రెండో ఫ్యామిలీ ఉన్న వాళ్ళు. ఆఫీసులు కాలేజీలు, వ్యాపార సముదాయాలు ఇప్పట్లో తెరిచే అవకాశాలు దాదాపుగా లేవు. పాపం కాలేజి కి వెళ్ళే సమయంలో ఆఫీస్ కి వెళ్ళే సమయంలో తమ ప్రియురాలిని కలిసి వెళ్ళే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచారం. అమ్మాయిలు అయితే తమకు నచ్చిన వ్యక్తితో ఫోన్ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఫోన్ పట్టుకుంటే ఇంట్లో తాట తీస్తారు.
ఇక మెసేజ్ చేసే అవకాశం ఉండదు. ఇరుకు ఇరుకు గా ఉండే ఇంట్లో అమ్మాయిలు అయితే పైకి చెప్పలేక కనీసం మెసేజ్ చేయలేక అవస్థలు పడుతున్నారు. ఫేస్బుక్ లో వీడియోలు చూస్తున్నామని వీడియో కాల్స్ కనపడకుండా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. ఇక రెండో ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. మెడికల్ షాప్ కి వెళ్ళినా సరే భార్య నుంచి ఫోన్ వస్తుంది.
ఎక్కడ ఉన్నారు.. ఎప్పుడు వస్తున్నారు, కరోనా ఉంది రోడ్డు మీద ఉండకండి అని సమయం పెడుతున్నారు. దీనితో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో కీలక చర్చ జరుగుతుంది. కరోనా వలన దేశం ఇబ్బంది పడటం లేదని, రెండో ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని, ప్రేమికులకు అయితే మరీ కష్టం ఉందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ కామెడి మాత్రం సోషల్ మీడియాలో మరింత సందడి పెంచుతుంది.