ఇసుక‌లో ఆలుగ‌డ్డ‌ల‌ను వేసి కాల్చి స్నాక్స్ త‌యారు చేస్తున్న వ్య‌క్తి.. వైర‌ల్ వీడియో..!!

ఆలోచ‌న అంటూ ఉండాలే గానీ ఎప్పుడూ పాత వంట‌కాలు కాకుండా కొత్త త‌ర‌హాలో భిన్న‌మైన ప‌దార్థాల‌ను త‌యారు చేసి భోజ‌న ప్రియుల‌కు అందించ‌వచ్చు. అలా వెరైటీగా చేసే ప‌దార్థాల‌నే జ‌నాలు ఇష్టంగా తింటారు. ఈ క్ర‌మంలోనే ఆ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి ఓ వెరైటీ స్నాక్స్ ను త‌యారు చేసి స్థానికుల‌కు అందిస్తున్నాడు. దీంతో అత‌ను అక్క‌డ బాగా పాపుల‌ర్ కూడా అయ్యాడు.

man cooks potatoes in sand viral video

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌ణిపురి టౌన్ లో ఉన్న గోలా బ‌జార్ అనే ప్రాంతంలో ఓ వ్య‌క్తి ఆలుగ‌డ్డ‌ల‌ను వినూత్న రీతిలో వండుతూ స్నాక్స్‌లా అందిస్తున్నాడు. అందుకు గాను అత‌ను ముందుగా ఒక భారీ పాత్ర‌లో ఇసుక పోసి దాన్ని వేడి చేస్తూ అందులో ఆలుగ‌డ్డ‌ల‌ను వేసి కాల్చుతాడు. అవి బాగా కాలుతాయి. లోప‌ల బాగా ఉడుకుతాయి. అలా 20 నిమిషాల పాటు వాటిని కాల్చాక బ‌య‌ట‌కు తీసి వాటికి అంటిన ఇసుక‌ను బాగా ఊపి తొల‌గిస్తాడు. అనంత‌రం ఆ ఆలుగడ్డ‌ల‌ను ప్లేట్‌కు నాలుగు చొప్పున ఇస్తాడు. వాటికి ఒక ప్ర‌త్యేక‌మైన సూప్‌, గ‌రం మ‌సాలా పొడి, చీజ్‌ను ఇస్తాడు. ఆ ఆలుగ‌డ్డ‌ల‌ను వాటికి అద్దుకుంటూ వాటిని తినాల్సి ఉంటుంది. చూస్తేనే ఆ ఆలు వెరైటీ స్నాక్స్ నోరూరింప‌జేస్తున్నాయి.

అయితే ఆ వ్య‌క్తి ఆలుగ‌డ్డ‌ల‌ను అలా స్నాక్స్‌లా వెరైటీగా అందిస్తుండ‌డాన్ని ఓ వ్య‌క్తి వీడియో ద్వారా చిత్రీక‌రించి త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. ఆలుగ‌డ్డ‌ల‌ను అలా వెరైటీగా కాలుస్తుండ‌డం అంద‌రికీ ఆసక్తి క‌లిగిస్తోంది. చాలా మంది అత‌న్ని అత‌ని నైపుణ్యానికి అభినందిస్తున్నారు.