ఖమ్మం సభలో పోటి పై షర్మిల క్లారిటీ ఇస్తుందా

Join Our Community
follow manalokam on social media

తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి ఖమ్మం వేదిక కానుంది. ఏప్రిల్‌ 9న లక్షమంది సమక్షంలో పార్టీ పేరును, జెండాను, అజెండాను ప్రకటించాలని ప్రణాళిక సిద్దం చేశారు. అయితే షర్మిల పోటి చేసే స్థానం పై కూడ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పాలేరు నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారన్న ప్రచారం పై ఖమ్మం సభ వేదికగా షర్మిల క్లారిటీ ఇస్తారన్న చర్చ ఊపందుకుంది.

వైఎస్ షర్మిల శిబిరం నుంచి పాలేరు మాట వినిపించగానే ఖమ్మం రాజకీయాల్లో కూడా హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది. పార్టీ ప్రయాణానికే కాకుండా తెలంగాణలో రాజకీయంగా వేళ్లూనుకోవడానికి కూడా ఖమ్మంను బేస్‌ చేసుకోబోతున్నట్టు ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ అంతట పోటి చేసినా ఖమ్మంలో మాత్రం వైసీపీ మెరుగైన ఫలితాలు సాధించింది. ఏపీకి సరిహద్దు ప్రాంతంగా ఉండటం, జిల్లాలోని గిరిజనుల్లో వైఎస్‌ పట్ల ఉన్న అభిమానం ఇప్పుడు కూడా తమకు కలిసి వస్తుందని లెక్కలేస్తుందట షర్మిల శిబిరం.

ఇదే సమయంలో పాలేరును షర్మిల ఎంచుకోవాలన్న డిమాండ్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది. పాలేరులో కాంగ్రెస్‌కు బలమైన కేడర్‌ ఉంది. మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్‌, దివంగత రామిరెడ్డి వెంకటరెడ్డితోపాటు, ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌ నుంచి గెలిచినవాళ్లే. వీళ్లంతా కాంగ్రెస్ నేతలుగా, వైఎస్ శిష్యులుగా ఉన్నారు. అందుకే పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిలపై అభిమానులు ఒత్తిడి తెస్తున్నారట.

వైఎస్‌ఆర్‌కు పులివెందుల ఎలానో.. మీకు పాలేరు అలాగే అని రెడ్డి, లంబాడా సామాజికవర్గాలకు చెందిన వారు షర్మిలకు చెబుతున్నారట. దానికి ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వనప్పటికి ఆమె మౌనం అంగీకారమని అభిమానులు ప్రచారం మొదలు పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తారనే చర్చకు శ్రీకారం చుట్టేశారు. పాలేరులో కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. కానీ అక్కడ రాజకీయం చేసేది మాత్రం రెడ్డి సామాజికవర్గం వారే. వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తే ఆమెపై వైఎస్‌ అభిమానిగా ముద్రపడ్డ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తారా కందాల వర్గం ఎటు మొగ్గు చూపుతుంది అన్న లెక్కలు నియోజకవర్గంలో అప్పుడే మొదలయ్యాయట.

షర్మిల టీం ఫోకస్ అంతా ఏప్రిల్‌ 9న నిర్వహించే ఖమ్మం సభపైనే ఉంది. ఆ రోజు పార్టీ ప్రకటనతోపాటు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేసేది షర్మిల వెల్లడిస్తారా అన్నది చూడాల్సి ఉంది.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...