తన ఊరి కోసం 30 ఏళ్ళు శ్రమించి కాలవ తవ్వాడు…!

తాగు సాగు నీటి సమస్యలు తీవ్రంగా ఉంటాయి. చాలా ప్రదేశాల్లో ఈ సమస్యతో ఇబ్బందులు ఎన్నో పడుతూ ఉంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో నీటి కొరత చాలా తీవ్రంగా ఉంది. తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. బీహార్ లో ఒక వృద్దుడు తన ఊరుకు నీళ్ళు తీసుకుని వెళ్ళడానికి గానూ ఏకంగా 30 కిలోమీటర్ల కాలువను తవ్వాడు. సమీపంలోని కొండల నుండి దిగుతున్న వర్షపు నీటిని తన గ్రామమైన గయలోని లాథ్వా ప్రాంతంలోని… కోతిలావా పొలాలకు తీసుకెళ్లేందుకు 3 కిలోమీటర్ల పొడవైన కాలువను తవ్వాడు.

ఒక వ్యక్తే ఇందుకు శ్రమించి కాలువను ఎన్ని ఇబ్బందులు ఉన్నా పూర్తి చేసాడు. ఈ సందర్భంగా అతను మీడియాతో మాట్లాడారు. “గ్రామంలోని ఒక చెరువుకు నీటిని తీసుకువెళ్ళే ఈ కాలువను తవ్వటానికి నాకు 30 సంవత్సరాలు పట్టింది” అని లాంగి భూయాన్ అనే వృద్దుడు మీడియాకు వివరించారు. అతనిని పలువురు ప్రసంశిస్తున్నారు.