స్వలింగ సంపర్కంపై ఈమె రాసిందే మొదటి పుస్తకం

-

ఆగ్నేయాసియా దేశమైన బ్రూనై దేశ సుల్తాన్ ఇటీవల ఓ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించాడు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ వారిని రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయించాడు. ఐక్యరాజ్యసమితి వివరాల ఆధారంగా 76 దేశాల్లో స్వలింగ సంపర్కం పట్ల వివక్ష చూపేలా చట్టాలున్నాయి. ఐరాస సభ్యదేశాల్లోని 71 దేశాలు దాన్ని నేరాల జాబితానుంచి తొలగించాయి.
 ఆ జాబితాల్లో భారతదేశం ఉంది. స్వలింగ సంపార్కాన్ని నేరాల జాబితా నుంచి తొలగించిన దేశాల్లో భారతదేశం ఉంది. ఇది నేరం కాదనే చారిత్మ్రాక తీర్పును సుప్రీం కోర్టు 2018లో వెల్లడించింది. మనదేశంలో హ్యూమన్ కంప్యూటర్ పేరుగాంచిన శకుంతలాదేవి 1977లోనే స్వలింగ సంపర్కుల(గే, లెస్బియన్, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్) హక్కులపై పుస్తకం రాసింది. అప్పట్లో ఆమె రాసిన పుస్తకం, ప్రస్తుత పరిణామాలు మరొక్కసారి ఆసక్తికరంగా మారుతున్నాయి.

బెంగళూర్ చెందిన శకుంతలాదేవి హ్యూమన్ కంప్యూటర్ ఖగోళశాస్త్రవేత్తగా మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ‘గే’ల హక్కుల కోసం, వారి మనస్తత్వాన్ని తెలుసుకొనేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు, స్వలింగ సంపర్కం నేరంగా భావించవద్దని చేసిన పోరాటం చాలా మందికి తెలియదు. వివాహం తర్వాత ఆమె ‘ద వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్’ అనే పుస్తకం రాసింది. ప్రపంచ వ్యాప్తంగా హోమోలను, గేలను కలుసుకొని వారి మనోగతాన్ని పుస్తకంలో ఆవిష్కరించింది. వారి ఇబ్బందులు, హక్కులు, వారి స్వభావం, గోప్యత అంశాలను ప్రపంచానికి తెలియజేసింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా చూడాల్సిన పని లేదనీ, సమాజం దాన్ని అంగీకరించాలని అమె అప్పుడే చెప్పింది. 1929లో జన్మించిన శకుంతలా దేవి చిన్నతనంలోనే గణితంలో విశేష ప్రతిభను చూపించింది. 1960లోపే హ్యూమన్ కంప్యూటర్ పేరు సాధించింది. గణిత, ఖగోళ శాస్త్రంలో కొత్త అధ్యయనాలు, ప్రపంచ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చింది. అప్పుడే కోల్ ఐఏఎస్ పని చేస్తున్న పరితోష్ బెనర్జీని వివాహం చేసుకుంది. కొద్ది రోజుల తర్వాత అతను హోమో సెక్సువల్ అనే విషయం తెలిసింది. అప్పటి కాలంలో అది చాలా పెద్ద విషయం.శకుంతలా దీని గురించి బాధపడకుండా హోమో సెక్స్ గురించి అధ్యయనం చేసింది. ఎంతో హోమోస్ మాట్లాడింది. ఎందుకు వీరి స్వభావం ఇలా ఉంటుందో తెలుసుకుంది. వారి సమస్యలు, సమాజంలో వీరి దుస్థితి పై లోతైన అధ్యయనం చేసి 1977లో ‘ద వరల్డ్ ఆఫ్ హోమో సెక్స్ పుస్తకం ప్రచురించింది. ‘ఈ పుస్తకం రాయడానికి నాకున్న ఆర్హత నేనొక మనిషిని, విలక్షణంగా ఉండడం, హోమోస్, లెస్బియన్స్ వివక్ష చూపడం చేయకూడదు. అటువంటి జీవన విధానం కూడా సృష్టిలో భాగమే’ అని చెప్పింది శంకుతలా దేవి. ఈమె రాసిన పుస్తకానికి అప్పట్లో స్పందన రాలేదు కానీ కాలంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆ పుస్తకాన్ని ఆమోదించాల్సి వస్తున్నది. హోమోసెక్స్ మీద రాసిన మొదటి పుస్తకంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది. 2018లో సుప్రీం కోర్టు ఈ అంశంపై తీవ్రంగా స్పందించింది. ‘ఇంతకాలం స్వలింగ సంపర్కం నేరం అని ఆ వర్గానికి చేసిన అన్యాయానికి చరిత్ర వారికి క్షమాపణ చెప్పాల’ని వాఖ్యానించింది. వ్యక్తుల లైంగిక స్వభావం అంతర్గతమైనది. అతను లేదా అమె ఎవరి పట్ల ఆకర్షితులవుతారన్న వారిపై వారి నియంత్రణ ఉండదు. దానిని అణచివేయడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అని పేర్కొంది. అందుకే సెక్షన్ 377ను అహేతుకమైందని తీర్పునిచ్చింది.

 -చిట్టితల్లి

Read more RELATED
Recommended to you

Latest news