రైల్వే ట్రాకులపై ఉండే W/L, W/B బోర్డులకు అర్ధం ఏంటో తెలుసా..?

-

రైల్వే ట్రాక్లపై చూసినట్లయితే మనకి కొన్ని బోర్డులు కనబడుతూ ఉంటాయి. ఆ బోర్డులు వెనక ఏం లేదు అని అనుకుంటే పొరపాటే. ఈ బోర్డులు వెనుక చాలా పెద్ద అర్థం దాగి ఉంటుంది. నిజానికి ఇలాంటి విషయాలని తెలుసుకోవడానికి ఆసక్తికరంగా కూడా ఉంటుంది. రైలులో మనం వెళుతున్నట్లయితే ట్రాక్ పైన బోర్డులు కనిపిస్తుంటాయి. ఆ బోర్డులలో కొన్ని సింబల్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి W/L లేదా W/B ఇలా పలు బోర్డులు ఉంటాయి. ట్రాక్ కు ఇరువైపులా కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి.

 railway tracks
railway tracks

లోకో పైలట్లకు సూచనలు ఇస్తూ ఉంటాయి. బోర్డులో W అంటే విజిల్ అని అర్థం. L అంటే లెవెల్ క్రాసింగ్, ఈ సూచన వచ్చినప్పుడు అక్కడ మానవ రహిత లెవెల్ క్రాసింగ్ ఉందని హారన్ కొట్టమని దానికి అర్థం. ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఇలా చర్యలు తీసుకోవడం జరిగింది. లెవెల్ క్రాసింగ్ కి 250 మీటర్ల దూరంలో సైన్ బోర్డ్స్ ఉంచుతారు.

ఈ బోర్డ్ ని చూడగానే విజిల్ అండ్ హారన్ కొట్టి లోకో పైలట్లు సిగ్నల్ ఇస్తారు. డబ్ల్యూ బై బి అంటే అక్కడ W హారన్ ని సూచిస్తుంది. B అంటే వంతెనను సూచిస్తుంది. ఆ సైన్ బోర్డు చూడగానే ముందు వంతెన ఉంటుందని గ్రహించి హారన్ కొడుతూ ఉంటారు. బ్రిడ్జి దాటే సమయంలో హారన్ వేస్తూ వెళ్లాలి. ఈ బోర్డులు పసుపు రంగులో ఉంటాయి. ఇలా పసుపు రంగులో బోర్డు ఉండి నలుపు రంగులో అక్షరాలు ఉండడం వలన దూరం నుండి కూడా అక్షరాలు బాగా కనబడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news