మీటూకు దీటుగా మహిళా బాధితుల కోసం మెన్ టూ..!

-

ప్రతి మహిళకు ఓ తండ్రి ఉంటాడు. సోదరుడు, కొడుకు ఉంటాడు. పురుషులను మనుషుల్లా చూడండి.. అంటూ ప్రారంభమైంది మెన్ టూ. ఇది కూడా ఓ ఉద్యమమే. ఈ మధ్య మీటూ ఉద్యమం ఊపందుకున్నది కదా.. ఆ తరహాలోనే ఈ మెన్ టూ ఉద్యమం కూడా. ఈ ఉద్యమాన్ని బెంగళూరుకు చెందిన క్రిస్ప్ అనే సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థ నిర్వాహకుడు కుమార్ జాగిర్దార్ ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు.

తాము మీటూకు వ్యతిరేకం కాదు.. కాకపోతే స్త్రీలకు వేధింపులు జరిగినట్టే… పురుషులు కూడా సఫర్ అవుతున్నారని… అటువంటి పురుషులపై జరిగే వేధింపులను వెలుగులోకి తీసుకురావడమే ఈ మెన్ టూ ఉద్దేశమని స్పష్టం చేశాడు. మొత్తానికి ఈ మెన్ టూ ఉద్యమం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహిళల వల్ల వేధింపులు ఎదుర్కొన్న పురుష బాధితులు ఈ మెన్ టూ ద్వారా నోరు విప్పుతున్నారు. ఏమో.. మీటూ లా ఈ మెన్ టూ కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందేమో.. దానికి కాలమే సమాధానం చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version