మానసికంగా బలహీనంగా ఉన్నారని చెప్పే సంకేతాలు.. మీలో ఉన్నాయేమో చూసుకోండి.

-

మానసికంగా బలంగా ఉన్నప్పుడే ఏ పనులైనా చేయగలుగుతారు. శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నప్పటికీ మానసికంగా బలం లేకపోతే అడుగు కూడా ముందుకు వేయలేరు. అందుకే ప్రపంచంలో పెద్దగా కనిపించే వారందరూ పెద్ద శారీరకంగా బలంగా ఉన్నట్టు కనిపించరు. అయినా సరే ప్రపంచాన్ని ఏలుతున్నారంటే దానికి కారణం మానసికంగా వారి పునాదులు బలంగా ఉండడమే. ఐతే మానసికంగా బలహీనంగా ఉండేవారిలో కనిపించే లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం.

 

వాళ్ళు తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకి రారు. అపజయం ఎదురవుతుందేమోనన్న భయం వారిని తమ కంఫర్ట్ జోన్ లోనే ఉండేలా చేస్తుంది.

ఒక పని ఛాలెంజింగ్ గా కనిపిస్తే చాలా తొందరగా వదిలిపెడతారు. ఛాలెంజింగ్ లో ఉన్న ఆనందాన్ని వారు ఆస్వాదించరు.

మీ చుట్టుపక్కల ఉన్నవారిపై కంప్లైంట్ చేస్తూ ఉంటారు. తప్పు మీదని ఒప్పుకోవడానికి జంకుతారు. అందుకే అవతలి వారి మీద తప్పుల్ని రుద్దుతారు.

ఇతరుల జీవితాల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. తాము పనిచేయాలని చూడరు.

వారి జీవితాలని పక్కనున్నవారే డిసైడ్ చేస్తారు. వారి గమ్యాలు, కోరికలని పక్కనున్నవారే నిర్ణయిస్తారు.

వారి అభిప్రాయాలని చెప్పడానికి కూడా భయపడతారు. ఏవరేమనుకుంటారో అన్న భయం వీరికి ఎక్కువగా ఉంటుంది.

ఏ పనైనా ఈజీగా చేయాలని చూస్తారు.

తమకేం కావాలో దాని గురించి ఫైట్ చేయాలని అనుకోరు.

పని మీద ఇష్టం లేకుండా పూర్తి చేయడానికి కష్టపడతారు. ఆ క్రమంలో మధ్యలో వదిలివేయడానికి కారణాలు వెతుక్కుంటారు. అనవసరమైన మాటల్లో పడి కాలాన్ని వృధా చేసుకుంటారు. వృధా అవుతుందని తెలిసినా పెద్దగా పట్టించుకోరు.

ఈ లక్షణాలు మీలో ఉన్నాయంటే మెంటల్ గా వీక్ గా ఉన్నట్టే లెక్క.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version