500 రూపాయలకే మినీ ఏసీ..ఈ సమ్మర్‌కి బెస్ట్‌ ఆప్షన్‌

-

వేసవిలో ఇంట్లో ఏసీలు, కూలర్లు ఉంటేనే ఆమాత్రం ఉండగలరు. కానీ అవి లేనీ వారి పరిస్థితి ఏంటి.. ఏసీ కొనాలంటే ఖర్చుతో కూడుకున్న పని.. బడ్జెట్‌లో ఏసీ వస్తే.. అది కూడా 500 నుంచి 2000లోపే అంటే.. ఇంకేంటి పండగే కదా..! ఈ సమ్మర్‌ను కూల్‌గా ఎంజాయ్‌ చేయాలంటే ఈ మినీ ఏసీ వైపు ఓ లుక్కేయండి.!

మినీ ఎయిర్ కూలర్

మినీ ఏసీలుగా పిలిచే ఈ చిన్న ఎయిర్ కూలర్లు రూ.499 నుంచి రూ.2000 వరకు వివిధ మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. మినీ ఏసీ వల్ల ఎక్కువ విద్యుత్తు ఖర్చు కానందున అధిక విద్యుత్ బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. AOXITO Mini Cooler అమెజాన్‌లో రూ.499 ధరకు అందుబాటులో ఉంది. USB మరియు బ్యాటరీతో ఆధారితమైన ఈ కూలర్ 10 గంటల వరకు పనిచేస్తుంది. తరచుగా నీరు అవసరం లేదు.
USB డెస్క్ ఫ్యాన్‌తో కూడిన NTMY మినీ ఎయిర్ కూలర్‌లో LED లైట్ కూడా ఉంది. 3 స్ప్రే మోడ్‌లు అందించబడ్డాయి. ఇందులో నీరు మరియు ఐస్ క్యూబ్స్ రెండింటినీ ఉపయోగించవచ్చు. ఇది 12 గంటల వరకు ఉంటుంది. ధర రూ.1,187.
SKYUP మినీ ఎయిర్ కూలర్ రూ.1,848 ధరలో అందుబాటులో ఉంది. నిర్దిష్ట బ్యాంకు కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై రూ.500 అదనపు తగ్గింపు కూడా ఇవ్వబడుతుంది. 600 మి.లీ. వాటర్ ట్యాంక్, 7 లైట్స్ మోడ్ వంటి అనేక ఫీచర్లతో కూడిన మినీ ఏసీ ఇది. విద్యుత్ కూడా చాలా ఆదా అవుతుంది.
అనేక మినీ AC మోడల్‌లు ఇప్పుడు హైడ్రో-సిల్ టెక్నాలజీ మరియు డ్యూయల్ కూలింగ్ జెట్‌ల వంటి ఫీచర్‌లతో వస్తున్నాయి. దీంతో తక్కువ ధరకే ఏసీ లాంటి కూలింగ్ పంపుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో వీటిని కొనుగోలు చేస్తే.. నచ్చకపోయినా, పనితీరు బాలేకపోయినా రిటర్న్‌ పెట్టుకోవచ్చు. మన డబ్బులు మనకు వచ్చేస్తాయి.

గమనిక :

ఈ కథనం కేవలం సమాచారం కోసం అందించాం.. ఈ ఉత్పత్తులకు ప్రమోషన్‌ కల్పించడం మా ఉద్దేశం కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version