కరీంనగర్‌ ప్రజలు అభివృద్ధి కోరుకుంటారా.. విధ్వంసం కోరుకుంటారా: బోయినపల్లి వినోద్‌ కుమార్‌

-

శాసనసభ ఎన్నికల్లో చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు.  రైతుబంధు ఎప్పుడు ఇవ్వాలో కూడా రేవంత్‌ రెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు. కరెంటు సరిగా లేక రైతుల మోటార్లు కాలిపోతున్నాయని.. పంట నష్ట పరిహారం కూడా ఇప్పటికీ ఇవ్వలేదని మండిపడ్డారు.  కరీంనగర్‌లో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌, పార్టీ నాయకులతో కలిసి వినోద్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు.

“బీఆర్‌ఎస్‌ పాలనలో కరెంటు ఎందుకు పోలేదు.. ఇప్పుడు ఎందుకు పోతున్నది. ఇండ్లలో మళ్లీ ఇన్వర్టర్లు కొంటున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్‌ ప్రభుత్వం విధ్వంసం చేస్తుంది. కరీంనగర్‌కు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఏం చేశారో చెప్పాలి. నేను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ కోసం కొట్లాడాను. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు రైల్వే లైన్‌కోసం నిధులు తీసుకొచ్చాను. కేబుల్‌ బ్రిడ్జి నిర్మించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. కరీంనగర్‌కు ఉన్నత విద్యా సంస్థలు తేవాలనేది తన లక్ష్యమని పట్టణానికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ తీసుకొస్తాను. సింగపూర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటాం.  ఇప్పటికే విద్యాసంస్థకు అవసరమైన 150 ఎకరాల భూమిని కూడా గుర్తించాం. కరీంనగర్‌ ప్రజలు అభివృద్ధి కోరుకుంటారో.. విధ్వంసం కోరుకుంటారో ఒక్కసారి ఆలోచించాలి” అని వినోద్ కుమార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version