ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. ఒకరి ప్రవర్తన, తీరు ఒక్కోలా ఉంటాయి. అయితే భావోద్వేగాలు కూడా అందరికీ ఒకేలా ఉండవు. కొంతమంది ఒకలా ఉంటే మరి కొంత మంది మరోలా ఉండొచ్చు. అయితే ఈ రాశి తల్లులు మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటారట. మరి ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి:
ఈ రాశి వారు అగ్నికి సంకేతం. ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కోపం వస్తుంది. వీళ్ళు ద్వేషించినట్టు ఏ రాశి వాళ్ళు ద్వేషించ లేరు. ఎంతో కఠినంగా ఉంటారు. అయితే అత్యంత ప్రేమ గల వాళ్లు కూడా ఈ రాశి వారే.
సింహ రాశి:
ఈ రాశి వాళ్ళు బలమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. ఈ రాశి వాళ్ళు పిల్లల్ని ఎలా చూస్తారు అనే విషయానికి వస్తే.. ఎంతో బాగా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు అయితే బయటికి భావోద్వేగాలు కనిపించవు. కానీ చాలా ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తారు.
కర్కాటక రాశి:
ఈ రాశిఫలలు కూడా ఎంతో ఎమోషనల్ గా ఉంటారు అయితే తన పిల్లల ముందు కానీ ఎవరు ముందు కానీ భావాలను వ్యక్తపరచరు.
వృశ్చిక రాశి:
ఈ రాశి వాళ్లు మానసికంగా ఎంతో తీవ్రంగా ఉంటారు. వీళ్ళకి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళు ఏదైనా సరే ఎంతో ప్రేమగా హృదయపూర్వకంగా చేస్తారు వృశ్చిక రాశి తల్లులు మానసికంగా తెలివైన వాళ్ళు.
మీన రాశి:
ఈ రాశి వాళ్లు ఎంతో దయగా ప్రేమగా కరుణతో ఉంటారు. ఎప్పుడూ కూడా పిల్లలని ఎంతో ఆనందంగా వీళ్ళు ఉంచుతారు.