చూడ‌కుండానే కొన్ని సెక‌న్ల‌లో రూబిక్ క్యూబ్ ను సాల్వ్ చేసిన బాలుడు.. స‌చిన్ ఫిదా.. వీడియో..!

Join Our Community
follow manalokam on social media

రూబిక్ క్యూబ్ తెలుసు క‌దా. అనేక ర‌కాల రంగుల్లో ఉంటుంది. దాని సాల్వ్ చేయాలంటే మ‌న‌కు చాలా స‌మ‌యం ప‌డుతుంది. కానీ కొంద‌రు అయితే చూడ‌కుండానే, క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని మ‌రీ కేవ‌లం కొన్ని సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే రూబిక్ క్యూబ్‌ల‌ను సాల్వ్ చేస్తుంటారు. అవును.. మాజీ దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ కూడా అలాంటి ఓ బాలుడి గురించి ఓ వీడియోను షేర్ చేశాడు.

mumbai boy solves rubik cube in seconds without seeing it video by sachin

ముంబైకి చెందిన అయిమ‌న్ కోలి రూబిక్ క్యూబ్‌ల‌ను సాల్వ్ చేయ‌డంలో దిట్ట‌. అత‌నికి అందులో గిన్నిస్ రికార్డు కూడా ల‌భించింది. ఈ క్ర‌మంలోనే అత‌ను తాజాగా స‌చిన్‌ను క‌లిశాడు. ఇక స‌చిన్ అతనికి ఒక రూబిక్ క్యూబ్‌ను ఇచ్చాడు. దీంతో దాన్ని అత‌ను ఒక‌సారి ప‌రిశీలించి త‌రువాత దాన్ని చూడ‌కుండా త‌న త‌ల‌పైన ఉంచి కొన్ని సెక‌న్ల‌లోనే సాల్వ్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Sachin Tendulkar (@sachintendulkar)

అలా ఆ బాలుడు రూబిక్ క్యూబ్‌ను సాల్వ్ చేసే స‌రికి స‌చిన్ ఫిదా అయ్యాడు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియోను సచిన్ షేర్ చేయ‌గా.. ఆ వీడియో వైర‌ల్ గా మారింది. ఆ వీడియోకు బ్రెట్ లీ వంటి ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు కూడా కామెంట్లు పెట్టారు. అత‌ను అలా చూడ‌కుండానే కొన్ని సెక‌న్ల‌లోనే ఆ రూబిక్ క్యూబ్‌ను సాల్వ్ చేయ‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...