ఆ బార్ కు వెళ్లకపోతే లైఫ్ వేస్ట్ అంటున్న నిహారిక కొణిదెల.. వీడియో

-

నిహారిక ప్రస్తుతం సూర్యకాంతం అనే సినిమాలో నటిస్తోంది. ఇదివరకు ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్ ను తీసిన ప్రణీత్ దర్శకత్వంలోనే సూర్యకాంతం తెరకెక్కుతోంది.

నిహారిక కొణిదెల… మెగా ఫ్యామిలీకే చెందినా.. ఎటువంటి సపోర్ట్ లేకుండా తనకు తాను సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలో నటించింది. యూట్యూబ్ లో కొన్ని వెబ్ సిరీసులు కూడా చేసింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది నిహారిక.

తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఇటీవల వైజాగ్ వెళ్లింది. వైజాగ్ లో ఉన్న బేకర్స్ కాస్టిల్ అనే డెసర్ట్ బార్ కు వెళ్లింది. డెసర్ట్ బార్ అంటే మద్యం దొరికే చోటు కాదు.. అక్కడ అన్నీ స్వీట్ ఐటెమ్స్ దొరుకుతాయి.

ఆ బార్ లో స్వీట్ ఐటెమ్స్ సూపర్బ్ టేస్ట్ ఉంటాయని తన ఫ్రెండ్స్ చెప్పారట. దీంతో ఆ రెస్టారెంట్ కు వెళ్లి అక్కడ ఉన్న డెసర్ట్స్ ట్రై చేసిందట. తిన్న తర్వాత ఆ టేస్ట్ కు మైమరిచిపోయిందట. ఎంత బావుంది అసలు. నేను వైజాగ్ లోనే ఇల్లు కొనుక్కుంటా. ఇక్కడే సెటిల్ అవుతా.. అంటూ చెప్పింది నిహారిక. అంత బాగున్నాయి అవి అంటూ వీడియోలో పేర్కొన్నది నిహారిక.



నిహారిక ప్రస్తుతం సూర్యకాంతం అనే సినిమాలో నటిస్తోంది. ఇదివరకు ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్ ను తీసిన ప్రణీత్ దర్శకత్వంలోనే సూర్యకాంతం తెరకెక్కుతోంది. స్టంట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వేసవి కానుకగా ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version