యాడ్స్ వేసి టైం వేస్ట్ చేశారని.. పీవీఆర్ ఐనాక్స్, బుక్ మైషోపై కేసు పెట్టిన వ్యక్తి

-

సినిమా ప్రారంభానికి ముందు అరగంట యాడ్స్ వేసి తన సమయాన్ని వృథా చేశారని పీవీఆర్ ఐనాక్స్‌పై,బుక్ మై షోపై బెంగళూరుకు చెందిన వ్యక్తి కేసు వేశాడు. 2023లో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి సాయంత్రం 4 గంటల షోకు PVR Inoxలో సినిమాకు వెళ్లగా, అరగంట యాడ్స్ వేసి సినిమాను సాయంత్రం 4:30 గంటలకు మొదలెట్టారు.

దీంతో 6 గంటలకు అయిపోవాల్సిన సినిమా 6:30 అయిపోయిందని, ఈ ఆలస్యం వల్ల తన షెడ్యూళ్లు క్యాన్సిల్ చేసుకున్నానని PVR Inoxపై, బుక్ మై షోపై వ్యక్తి కేసు వేసినట్లు తెలిసింది. సమయాన్ని వృథా చేసినందుకు PVR Inoxను సదరు వ్యక్తికి రూ.65000 చెల్లించాలని, అలాగే రూ.1,00,000 జరిమానా కట్టాలని కోర్టు తీర్పునిచ్చింది. కాగా, సమయం వృథా కేసులో బుక్ మై షోకి సంబంధం లేదని మినహాయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version