ఎంత ట్రై చేస్తున్నా ప్రేమలో పడడం లేదా..? ఈ 5 టిప్స్‌ తో గుండెల్లో చోటు ఖాయం..!

-

ఒక్కొక్కసారి కొంత మందిని చూడగానే ప్రేమలో పడిపోతూ ఉంటాము. నిజానికి ప్రేమలో పడడానికి అందంతో పని లేదు. కొంతమంది మొదటిసారి చూడగానే ప్రేమలో పడిపోతారు మరికొందరు చూడగా చూడగా ప్రేమలో పడతారు. ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తిని మనం గాఢంగా ప్రేమిస్తూ ఉంటాము కానీ వారికి మన మీద ప్రేమ కలగకపోవచ్చు. వాళ్ళని ఎలా అయినా ప్రేమలో పడేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఎక్కువగా అబ్బాయిలు అమ్మాయిలని ప్రేమిస్తూ… వాళ్ళని ప్రేమలో పడేయాలని చూస్తారు అందుకోసం వివిధ రకాల పద్ధతుల్ని ట్రై చేస్తూ ఉంటారు. గిఫ్ట్స్ ఇచ్చి ప్రేమలో పడేయాలని కొంతమంది ప్రయత్నిస్తే మరి కొందరు ప్రేమలేఖలు రాయడం లేదంటే వాళ్లకి ఇష్టమైన పనులు చేయడం మెసేజ్లు పంపడం ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ అమ్మాయి ప్రేమించకపోతే గడ్డాలు పెంచుకునే దేవదాసులా మారిపోతుంటారు.

ఇవి మనం రియల్ లైఫ్ లోనూ చూస్తాము సినిమాల్లోని చూస్తాము. అయితే నచ్చిన అమ్మాయి మిమ్మల్ని మెచ్చాలి అంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి ఈ టిప్స్ ని ఫాలో అయితే కచ్చితంగా మీరు ప్రేమించే అమ్మాయి మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తుంది.

ఈ ఐదు టిప్స్ తో గుండెల్లో చోటు గాయం..

మీరు ఆ అమ్మాయి తో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వండి అలానే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్.. మొదటిసారి అబ్బాయిని కలిసినప్పుడు ఎటువంటి లక్షణాలు అబ్బాయిలు ఉన్నాయి అనేది అమ్మాయిలు గమనిస్తారు. అయితే మీ దగ్గర ఖరీదైన వస్తువులు బ్రాండెడ్ బట్టలు ఉండక్కర్లేదు మంచి లక్షణాలు ఉంటే చాలు.

ముందు మీరు ఆత్మవిశ్వాసంతో ఉండడం అవసరం. అలానే ఆ అమ్మాయి తో సరదాగా మాట్లాడుతూ నవ్విస్తూ ఉండాలి. అలానే ఆమెతో కాకుండా ఇతర వ్యక్తులతో కూడా మీరు ఎలా ఉంటున్నారు అనేది అమ్మాయి గమనిస్తుంది. కాబట్టి మిగిలిన వారితో కూడా మంచిగా ప్రవర్తించండి.

అలానే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు అమర్యాదగా ఇతరులతో మాట్లాడుతున్నారా లేదా అనేది కూడా అమ్మాయిలు గమనిస్తారు చాలామంది అమ్మాయిలని ఇంప్రెస్ చేయాలని సిల్లీ సిల్లీ పనులు చేస్తారు. అటువంటివి చేయకండి.

మీరు మీలాగే ఉండాలి. ఏదో సినిమాలో చేసినట్లు మీరు ఫాలో అయితే కచ్చితంగా అది యాక్టింగ్ అని ఆమెకు తెలిసిపోతుంది. అయితే ఏ అమ్మాయికైనా సరే ప్రేమించాలంటే సమయం పడుతుంది ఓపికగా ఎదురు చూడండి. ఆ అమ్మాయి కోసం మీరు ఏమైనా చేయగలనని ఆమెకి తెలిసేలా మీ ప్రవర్తన ఉండాలి. అలానే చాలా మంది అమ్మాయిలు వారు ప్రేమించే వ్యక్తి నుండి మంచి సపోర్ట్ దొరకాలని చూస్తారు.

మంచి లైఫ్ ని తనకి ఇవ్వగలిగే వ్యక్తినే అమ్మాయిలు ఇష్టపడతారు. అయితే లవ్ లో గెలుపు ఓటమీ రెండు ఉంటాయి. ఒకవేళ మీరు ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించకపోతే జీవితం అయిపోయిందని మాత్రం అనుకోకండి. ఏమో మరో గోల్డెన్ ఛాన్స్ మీకోసం ఎదురు చూస్తూ వుండచ్చేమో..?

Read more RELATED
Recommended to you

Exit mobile version