బిచ్చగత్తె జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క ఫోటో!

ప్రతి ఒక్కరు జీవితంలో ఎన్నో సమస్యలను, ఒడిదుడుకులను అధిగమిస్తూ ఉంటారు. అదృష్టం కలిసొస్తే మన జీవితంలో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అది కాలమే నిర్ణయిస్తుంది. బిచ్చగత్తె జీవితంలో కూడా ఇలాంటి అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆ ఒక్క ఫోటో ఆమె జీవితాన్నే మార్చేసింది. ఇంతకీ ఎవరు ఆమె? వివరాలేమిటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఫిలిప్పీన్స్ ప్రాంతానికి చెందిన ఈ బిచ్చగత్తె నిరుపేద కుటుంబం. తనకు ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండటంతో కుటుంబాన్ని పోషించడానికి వేరే దారి లేక బిచ్చమెత్తుకుంటు కుటుంబాన్ని పోషిస్తుంది. అయితే ఒకరోజు ఫిలిప్పీన్స్ ప్రాంతంలో బిచ్చమెత్తుకుంటున్న ఆ అమ్మాయి ఒక ప్రముఖ ఫోటోగ్రాఫర్ కంటపడింది. అతను ఫిలిప్పీన్స్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్లో వీక్షించడానికి వచ్చాడు. అయితే ఆ అమ్మాయిని చూడగానే తన ఫోటోను తీశాడు.

తన తీసిన ఫోటోను చూసి నాచురల్ బ్యూటీ అని వర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఫోటో బాగా వైరల్ అవడంతో పాటు లక్షకు పైగా లైక్స్ వేల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. ఆ తరువాత ఆ ఫోటోగ్రాఫర్ ఆమెను కలిసి వివరాలు సేకరించాడు. ఆ ఒక్క ఫోటో ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది బిచ్చగత్తె నుండి మోడల్ గా ఎదిగింది.

మొదట మోడల్ గా చేసి, తరువాత టీవీ సీరియల్ లో నటించింది. తరువాత సినిమాలలో కూడా హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది రీటా. హీరోయిన్ గా తన జీవితంలో బిజీగా ఉంటూ కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. అలా తన 13వ ఏట తీసిన ఫోటో ఆమె జీవితాన్నే మార్చేసింది. ప్రస్తుతం ఆమె కుటుంబ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది.