భార్యకు ఉల్లి పోగులు ఇచ్చిన స్టార్ హీరో…!

-

దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఉల్లి కంటే బంగారమే నయం అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇక దానిని వాడకుండా ఉంటే మంచిది అంటూ కొందరు సూచిస్తున్నారు కూడా… ఎక్కడ చూసినా సరే ఇదే పరిస్థితి ఉంది. విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేస్తున్నా సరే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మహారాష్ట్రలో పడిన వర్షాలు దేశం మొత్తం చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లి కొరత దెబ్బకు ప్రభుత్వాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులకు తక్కువ ధరకే ఉల్లిని అందించే,

కార్యక్రమాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లి ధరలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు ఉల్లి విలువ గురించి పలు ఫన్నీ పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఉల్లి దండలు, ఉల్లి తో డబ్బులు చెల్లించడం, ఉల్లి కానుకలు ఇవ్వడం. ఉల్లి మార్పిడి వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఉత్తరాదిలో అయితే ఉల్లి దొంగలు కూడా పడ్డారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే… బాలివుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన భార్యకు ఉల్లిపాయ పోగులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘‘కపిల్ శర్మ షో నుంచి తిరిగొచ్చిన నా భర్త.. వీటిని కరీనాకు చూపించారు. వీటిని ఆమె అంతగా ఇష్టపడినట్టు అనిపించలేదు.. కానీ నీకివి నచ్చుతాయని నాకు తెలుసు. అందుకే నీకోసం తెచ్చా’’ అంటూ అక్షయ్ తనతో వ్యాఖ్యానించినట్టు అతని భార్య ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి… ఎపుడు సరదాగా ఉండే అక్షయ్ ఫ్యామిలీ ఈ విధంగా పోస్ట్ చేయడం అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news