నాశనం చేసేస్తున్న ఆన్లైన్ గేమ్స్… ముఖ్యంగా ఆ రెండే…!

-

స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత యువత నాశనం అయిపోయారు అనేది వాస్తవం… ఈ మాట నచ్చినా నచ్చకపోయినా బలవంతంగా అయినా సరే అంగీకరించక తప్పదు… ఎన్ని విధాలుగా మీరు ఉపయోగాలు ఉన్నాయని చెప్పినా సరే ఇది జీవితాలను నాశనం చేసింది. విలాసానికి, బానిసత్వానికి, చెడు అలవాట్లకు… స్మార్ట్ ఫోన్ దగ్గర చేసింది. ఇప్పుడు ఎన్నో ఆన్లైన్ గేమ్స్ స్మార్ట్ ఫోన్ లో అందుబాటులోకి వచ్చాయి. పనీ పాట లేని చాలా మంది… వాటిల్లో ఉండే గేమ్స్ మీద సమయాన్ని వెచ్చిస్తున్నారు.

ముఖ్యంగా ఇప్పుడు ఆన్లైన్ లో కొన్ని ఆటలు అందుబాటులోకి వచ్చి యువతను నాశనం చేస్తున్నాయి అనేది వాస్తవం. డ్రీం 11, పబ్ జి ఆటలకు యువత ఎక్కువగా అలవాటు పడ్డారు… ఇందులో పడి జేబులు గుల్ల చేసుకుంటుంది యువత… పబ్ జి లో ఆ స్కిన్ ఈ స్కిన్ అంటూ వేలల్లో ఖర్చు చేస్తున్నారు. ఆ ఆట కోసం ప్రత్యేక పరికరాలను కూడా కొని ఫోన్ కి అమర్చే కార్యక్రమం చేస్తున్నారు. ఆన్లైన్ లో వాటిని కొనుగోలు చేసి పబ్ జి ఆడుతున్నారు. ఇందుకోసం కొంత మంది దొంగతనాలు కూడా చేస్తున్నారు…

ఆ ఆటలో ఆడే స్కిన్ ని పబ్ జి సంస్థ వేలల్లో ఉంచుతుంది… దాని కోసం ఎంత వరకు అయినా తెగించి అవి ఉండటం ఒక గర్వకారణంగా భావిస్తున్నారు యువత. ఇక డ్రీం 11 లో అయితే… ఇది బెట్టింగ్ తో సమానం… బెట్టింగ్ ఏ దీని ముందు చాలా నయం… మ్యాచ్ వచ్చినప్పుడు బెట్టింగ్స్ చేస్తారు… కాని ఇందులో ఏదో వస్తుంది అనే ఆత్రంతో… డబ్బులు కట్టి మరీ ఆడుతున్నారు. ఎక్కడో ఒకరికి ఇద్దరికీ వచ్చినవి చూసి తమకు కూడా వస్తాయని భావించి దానికి బానిసలు గా మారిపోతున్నారు… ఉద్యోగాలు చేసే వారు కూడా నెల అంతా కస్టపడి దీనిలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news