టిక్‌టాక్ మోజులో ప‌డి భ‌ర్త‌ను వ‌దిలేసి భార్య మ‌రో యువ‌తితో జంప్‌..

టిక్ టాక్… సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే క్రేజీ యాప్. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ పిచ్చపిచ్చిగా ఈ యాప్ ను వాడేస్తున్నారు. టిక్‌టాక్‌ వల్ల ఎందరో ఉద్యోగాలు ఊడగొట్టుకున్నారు.. మరెందరో ఆత్మహత్యలూ చేసుకున్నారు.. ఇవన్నీ ఓ ఎత్తయితే మరెన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే తాజాగా టిక్‌టాక్ మోజులో పడ్డ భార్య.. తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. కర్నూల్ జిల్లా కిలిచినపేటకు చెందిన ఓ మహిళ చెల్లెలిని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేసింది. అతను బెంగళూరులోనే పెట్రోలు బంక్‌లో పనిచేస్తున్నాడు.

అదే బంకులో పనిచేస్తున్న ఓ యువతిని అతను తన భార్యకు పరిచయం చేశాడు భర్త. ఆ పరిచయం కాస్తా.. ఎక్కడికో పోయింది. టిక్‌ టాక్‌లో వీడియోల దాకా సాగింది. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంత ప్రేమ వారిద్దరి మధ్య ఏర్పడింది. అయితే ఏం జరిగిందో ఏమోగానీ.. ఇంట్లో చెప్పుకుండా ఆ యువతికోసం అర్చన బెంగళూరు వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా అర్చన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు వివాహిత ఆచూకీ దొరిగిందని బెంగళూరులోనే ఉందని పోలీసులు తెలిపారు.