రూ.100 కే బిట్‌కాయిన్‌ .. ఎప్పుడైనా అమ్మొచ్చు!

-

మారుతున్న ప్రపంచం.. ఆలోచనలు.. ధోరణి ఇలా ప్రతీది మారుతూనే ఉంది. అదేవిధంగా ఇప్పడు బిట్‌ కాయిన్ల విక్రయాలు పెరిగాయి. చాలా మంది వీటిని కొనడానికి ఉత్సాహం చూపుతున్నారు. కానీ, దీని గురించి తెలిసిన వారు చాలా తక్కువే. అయితే, కేవలం రూ.100 కే బిట్‌కాయిన్‌ ఎలా కొనాలో తెలుసుకుందాం. ఈ ఏడాది క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌ విలువ చాలా పెరిగింది. అయితే దీనివల్ల సామాన్య ప్రజలు కూడా బిట్‌ కాయిన్లు కొనుక్కునే అవకాశం లభిస్తోంది. ఇది యాక్సిస్, ఐసీఐసీఐ డైరెక్ట్, పేటీఎం మనీ లాంటిదే. కేవలం రూ.100 తోనే బిట్‌ కాయిన్‌ కొనవచ్చు. కాయిన్‌ విలువ పెరిగితే మన పెట్టుబడి విలువ కూడా పెరుగుతుంది. పూర్తి కాయిన్‌ మనకు దక్కకపోవచ్చు కానీ, మనం పెట్టుబడి పెట్టిన దానిలో కొంత మేర దక్కుతుంది. నష్టాల అంచనా తక్కువే.

 బిట్‌ కాయిన్‌/ bitcoin
సాధారణంగా బిట్‌ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఎక్సె ్ఛంజ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో http://www.wazirx.com ఒకటి. దీనికోసం వెబ్‌సైట్‌లోకి వెళ్లి సైన్‌ అప్‌ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ మీ పేరు, మొబైల్‌ నంబర్, ఈమెయిల్‌ ఐడీ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేవైసీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆధార్‌ నంబర్, ప్యాన్‌ కార్డ్‌ నంబర్‌ వివరాలు ఇవ్వాలి. దీంతో మీ పూర్తి వివరాలు వజీర్‌ ఎక్స్‌ సైట్‌కి చేరతాయి. అప్పుడే మీకు ట్రేడింగ్‌ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. దీనికోసం మీరు వజీర్‌ ఎక్స్‌ సైట్‌లోని మీ అకౌంట్‌లో కొంత మొత్తం దాచుకోవాల్సి ఉంటుంది. కనీసం రూ.100 వేస్తే అప్పడు మీరు బిట్‌ కాయి¯Œ పై ట్రేడింగ్‌ మొదలుపెట్టవచ్చు. ప్రతి రోజూ మీరు పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం వచ్చిందో తెలుసుకోవచ్చు. కానీ, ప్రతి రోజూ లాభమే వస్తుందనేందుకు గ్యారెంటీ లేదు. బిట్‌ కాయిన్‌ విలువ పెరిగితే మీరు పెట్టిన పెట్టుబడికి ఎంతో కొంత లాభం వస్తుంది. అదే బిట్‌ కాయిన్‌ విలువ తగ్గితే, మీరు పెట్టిన పెట్టుబడిలో కొంత నష్టపోవాల్సి ఉంటుంది. అందుకు సిద్ధమైతేనే ఈ ట్రేడింగ్‌ చెయ్యవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news