థర్డ్ వేవ్ పై ఏపీ అలర్ట్ : అధికారులకు జీఓఎమ్ కీలక ఆదేశాలు

-

అమరావతి: కోవిడ్ పరిస్థితి, థర్డ్ వేవ్ సన్నద్ధత పై గ్రూప్ అఫ్ మిమిస్టర్స్ సమావేశం జరిగింది. మంత్రి ఆళ్ల‌నాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు బొత్స, బుగ్గన, కన్నబాబు, అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా థర్డ్ వేవ్ పై అధికారులకు జీఓఎమ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ వేవ్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించింది ఏపీ జీఓఎమ్. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్ ముందుగానే పరిశీలించి అవకాశం ఉన్న చోట పిల్లలకు చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేయాలని.. థర్డ్ వేవ్ లో అవసరమైన అన్ని రకాలు మందులు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొంది జీఓఎమ్.

అర్హులైన తల్లులకు ఒక రోజు ముందుగానే వ్యాక్సిన్ టోకెన్స్ పంపిణికి ఏర్పాట్లు చేయాలని.. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన వారికి అన్ని హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని ఆదేశించింది. ఇంజక్షన్స్ బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు జరిగితే కఠినంగా వ్యవహారించాలని.. కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రులు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2వేలకు పై బడి బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయని.. చిన్న పిల్లలకు వైద్యం అందించడానికి అదనంగా వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని పేర్కొంది జీఓఎమ్. హాస్పిటల్స్ లో బెడ్స్ అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశాలు జారీ చేసింది జీఓఎమ్.

Read more RELATED
Recommended to you

Latest news