పిల్లలు ప్రతిదీ తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని విషయాల్లోనూ అవగాహన కల్పించే విధంగా చూసుకోవాలి. పిల్లలకి కోరికలు, అవసరాల మధ్య వ్యత్యాసాన్ని వివరించాలి. అలాగే డబ్బు ఖర్చు విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయాలి. ఆహారం, దుస్తులు వంటి అవసరాలని కొనుగోలు చేయడానికి బొమ్మలు వంటి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడానికి డబ్బు ఉపయోగించే విధానాన్ని వాళ్ళకి చెప్పాలి. అలాగే డబ్బు అనేది తేలికగా వచ్చేది కాదని కష్టపడి పని చేయాలని వాళ్ళకి నేర్పాలి. పొదుపు ప్రాముఖ్యతను అర్థం చేసుకునేలా పిల్లల్ని మార్చండి.
భవిష్యత్తులో వారు కోరుకునే వస్తువుల కోసం డబ్బులు దాచుకునే విధంగా అలవాటు చేయడం మంచిది. ఇలా చేయడం వలన వారిలో సహనం వస్తుంది. వాళ్ళ లక్ష్యాల కోసం కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది. పిల్లలకి డబ్బును పొదుపు ఖర్చు వంటి కేటగిరీలు విభజించి చెప్పడం మంచిది. ఇంటి బడ్జెట్ గురించి కూడా పిల్లలకి చెప్పాలి. పాకెట్ మనీ ని కొద్దిగా ఇచ్చి ఎలా ఖర్చు పెట్టాలో నేర్పించండి.
ఏదైనా కొనేముందు నిజంగా అవసరమా కొన్ని రోజులు తర్వాత కూడా అవసరమా ఇలాంటి ప్రశ్నలు వేసి వాళ్ళకి నేర్పించడం వలన వాళ్ళకి అది అవసరమో కాదో తెలుస్తుంది అలాగే పిల్లలకి తమ డబ్బును అవసరంలో ఉన్న వారితో పంచుకోవాలని బోధించాలి. ప్రేమ సానుభూతిని ఇది నేర్పిస్తుంది. అలాగే పిల్లలకి ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు మడత పెట్టడం వంటి పనులు కూడా చెప్తూ ఉండాలి వాళ్ల నిర్ణయం వాళ్ళు తీసుకునే విధంగా వారి పనులు వాళ్ళ చేసుకునే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలి.