తెలంగాణలో ఏపీ కంటే తక్కువ పింఛను : సీఎం చంద్రబాబు

-

ఏపీలో సంపద సృష్టించి ప్రజల కోసం ఖర్చు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాసేవలో భాగంగానే పింఛను నగదు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రజలే ముందు ఆ తర్వాతే మిగిలిన పనులు అని చెప్పారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో పర్యటించిన సీఎం.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛను అందజేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “వైఎస్సార్సీపీ హయాంలో నొక్కిన బటన్లన్నీ కూటమి ప్రభుత్వమిచ్చే పింఛన్లతో సమానం. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పిన నేను ఆ మాట ప్రకారం ముందుకెళ్తున్నాను. ఏప్రిల్‌ నుంచే పెంచిన పింఛన్లు అమలు చేస్తున్నాం. దివ్యాంగులకు రూ.6 వేలు అందిస్తున్నాం. పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చవుతోంది. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ పింఛను ఇస్తున్నాం.” అని చంద్రబాబు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version