రఘురామ కృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి GGH సూపరింటెండెంట్ ప్రభావతి దర్యాప్తుకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేషించింది. ఈ నెల 7, 8 తేదీల్లో సంబంధిత పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరుకావాలని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం.
గతంలో ప్రభావతికి మధ్యంతర ఉపశమనం కల్పించింది జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చెప్పినా దర్యాప్తుకు సహకరించలేదని కోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. విచారణకు సహకరించకపోతే మధ్యంతర ఉపశమనం రద్దు అవుతుందని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ ఈ నెల 15కి వాయిదా వేసింది.