పవన్ కల్యాణ్‌కు 33 కోట్ల అప్పులున్నాయి..!

-

అప్పులు ఓకే.. మ‌రి ఆయ‌న‌కు ఉన్న ఆస్తుల సంగ‌తి ఏంటి.. ఆయ‌న‌కు ఎక్క‌డెక్క‌డ ఆస్తులు ఉన్నాయో వాటి గురించి కూడా చెప్పాలి క‌దా… అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

పవర్ స్టార్ కాదు ఇప్పుడు ఆయన. జనసేన అధ్యక్షుడు. అఫ్‌కోర్స్ మళ్లీ ముఖానికి రంగేస్తే పవర్ స్టారే. కానీ.. ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్లు బిజీగా గడుపుతున్న పవన్ కల్యాణ్‌కు 33 కోట్ల అప్పులున్నాయట. ఆయన ఒక్క సినిమా తీస్తే దాదాపు 15 నుంచి 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటారు. అటువంటి హీరో రేంజ్ ఎలా ఉండాలి.. ఆయనకు అప్పులేంటి.. అనే డౌట్లు మీకు వచ్చి ఉండొచ్చు. కానీ.. ఆయనకు మాత్రం 33 కోట్లకు పైనే అప్పులున్నాయట. ఈ విషయం ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్ ద్వారా తెలిసింది.

పవన్ కల్యాణ్ స్నేహితుడు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర 2 కోట్ల 40 లక్షల అప్పు తీసుకున్నారు. హారిక హాసిని సంస్థ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ 1.25 కోట్లు. తన వదిన కొణిదెల సురేఖ వద్ద తీసుకున్న పర్సనల్ లోన్ కోటీ ఏడు లక్షలు. ఎమ్ ప్రవీణ్ కుమార్ ఇచ్చిన పర్సనల్ లోన్.. 3 కోట్లు. ఎమ్‌వీఆర్‌ఎస్ ప్రసాద్ ఇచ్చిన పర్సనల్ లోన్ 2 కోట్లు. బాలాజీ సినీ మీడియా సంస్థ ఇచ్చింది 2 కోట్లు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇచ్చింది 27 లక్షలు. మైత్రీమూవీస్ వై నవీన్ కుమార్ ఇచ్చిన లోన్ 5 కోట్ల 50 లక్షలు. ఇంకా వేరే బకాయిలు 3 కోట్ల 60 లక్షలు. అవన్నీ కలిపితే.. ఆయన అప్పు 33 కోట్ల 72 లక్షల 65 వేల 361 రూపాయలు.



అయితే.. ఆయన అప్పుదేముంది ఓ రెండు సినిమాలు చేస్తే అవే తీరుతాయి. అయినా.. ఇవి అప్పులే కానీ.. ఆయనకు ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి కదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version