అక్కడెక్కడో అనంతపురంలో ఉన్న హిందూపురానికి వలస పోయారు. అక్కడ తొడగొడితే ఏం లాభం. తన సొంత ఊళ్లో కొట్టాలిగా.
కన్న ఊరు అమ్మలాంటిదంటారు పెద్దలు. అందుకే కన్న ఊరుకు ఏదో ఒకటి చేయాలంటారు. అయితే.. రాజకీయాల్లో మాత్రం ఇది వర్తించదు కాబోలు. ఎందుకంటే.. రాజకీయాల్లో ఆరితేరిన మహామహులు తమ సొంత నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి హడలెత్తిపోతున్నారు. ఏపీ చంద్రబాబు కావచ్చు, ఆయన కొడుకు నారా లోకేశ్ కావచ్చు.. సినీ నటుడు బాలకృష్ణ కావచ్చు.. మెగా బ్రదర్స్ కావచ్చు.. ఎవరూ అతీతులు కాదు. రాజకీయాల్లో తాము ఉద్ధండులమంటారు. కానీ.. తమ సొంత నియోజకవర్గంలో పోటీ అనగానే వణికిపోతారు. మాకొద్దు బాబోయ్ ఆ నియోజకవర్గం అంటూ పారిపోతారు. ఇది ఇప్పడే కాదు ఆనాదిగా వస్తున్న ఆచారం. తమ సొంత నియోజకవర్గంలోనే నెగ్గలేని ఈ నేతలు రాష్ర్టాన్ని ఎలా పాలిస్తారు.. అన్న అనుమానం సగటు ఏపీ పౌరుడికి కలగదా?
చంద్రగిరి పేరెత్తితే చంద్రబాబుకు వణుకు
తన సొంత నియోజకవర్గం చంద్రగిరి పేరెత్తితే చంద్రబాబుకు వణుకు పుడుతుంది. 1983లో చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత మళ్లీ అటువైపు చూడలేదు. కుప్పం నుంచే పోటీ చేస్తున్నారు. ఆయన సొంత ఊరు నారావారిపల్లె చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఉంది. 1978లో చంద్రగిరి నుంచి పోటీచేసి గెలిచినా.. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ చంద్రగిరి జోలికి పోలేదు.
చంద్రగిరి వద్దు నాన్నారూ..
సేమ్ చంద్రబాబు లెక్కనే ఆయన కొడుకు లోకేశ్ కూడా చంద్రగిరి పేరెత్తితేనే భయపడుతున్నారు. అసలు ఎన్నికల్లో పోటీ చేయడమంటేనే భయపడే లోకేశుడు.. చంద్రగిరి నుంచి పోటీ చేస్తారా? ఏదో దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారు కానీ.. లేకపోతే ఆయన పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే కదా. 2019లో పోటీ చేయకపోతే విలువ ఉండదని గ్రహించి లోకేశ్‌తో సేఫ్ నియోజకవర్గం మంగళగిరి నుంచి పోటీ చేయిస్తున్నారు చంద్రబాబు.
సొంత నియోజకవర్గంలో తొడ కొట్టలేకపోతున్న బాలయ్య
నందమూరి బాలకృష్ణ కూడా అంతే. తన సొంత నియోజకవర్గం గుడివాడ అంటేనే దడుసుకుంటున్నారు. తన సొంత నియోజకవర్గంలో పోటీ చేయడానికి మాత్రం సాహసించడం లేదు. అందుకే అక్కడెక్కడో అనంతపురంలో ఉన్న హిందూపురానికి వలస పోయారు. అక్కడ తొడగొడితే ఏం లాభం. తన సొంత ఊళ్లో కొట్టాలిగా.
సొంతూరికి మెగా బ్రదర్స్ దారేది
మెగా ఫ్యామిలీ పరిస్థితి కూడా అంతే. వాళ్ల సొంతూరు మొగల్తూరు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం వాళ్ల నియోజకవర్గం. అయితే.. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత అన్నయ్య చిరంజీవి కానీ.. ఇప్పుడు జనసేన స్థాపించిన తమ్ముడు పవన్ కల్యాణ్ కానీ నరసాపురం నుంచి పోటీ చేయడానికి ససేమిరా అంటున్నారు. 2009లోనూ చిరంజీవి పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేశారు. ఇప్పుడు పవన్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు. సొంత ఊరు అంటేనే మెగా బ్రదర్స్ కూడా టెన్షన్ పడిపోతున్నారు.