వైరల్‌: బుడ్డోడికి పిల్లి వార్నింగ్‌

-

ఇళ్లలో చిన్న పిల్లలపై నిరంతం ఓ కన్నెసి ఉంచుతారు. ఎందుకంటే వారు బయటకు వెళ్లడం, ప్రమాదకరం వస్తువులను తాకడం, ఎత్తుగా ఉన్న బల్లలు, గోడలను ఎక్కడం చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రులు వారు చేసే అల్లరి పనులను హెచ్చరిస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఆ బుడ్డోడిని నిరంతరం గమనించే బాధ్యత ఓ పెంపుడు పిల్లి తీసుకుంది. దానికి సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆ చిన్నారినే గమనిస్తూ అతను ప్రమాదక ప్రయత్నాన్ని అడ్డుకుంటూ కాపాలాగా ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ది ఫీల్‌ గుడ్‌ అనే ట్విటర్‌ పేజీలో ‘అతని రక్షణ దేవత’ అంటూ షేర్‌ చేసిన ఈ వీడియోకు వేలల్లో లైక్స్‌.. కామెంట్స్‌ వచ్చాయి. ఇప్పటికీ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ‘ఆ బుడ్డుడికి ప్రమాదం జరగకుండా హెచ్చరించడంలో కుటుంబ సభ్యులతో సమానంగా ఈ పిల్లి తీసుకున్నట్లు నెటిజన్లు పిల్లిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఓ చిన్నారి ఇంటి బాల్కానీ వద్ద నిలబడి ఉండగా, అతడి పక్కనే ఆ ఇంటి పెంపుడు పిల్లి గమనిస్తూ కూర్చుంది. కాసేపటికి ఆ బాలుడు బాల్కానీ గోడ పట్టుకుని పైకి ఎక్కడానికి గోడ అంచును పట్టుకోవడానికి చేతులు చాస్తుండగా ఆ పిల్లి వద్దన్నంటు వారిస్తోంది. అయినా అతడు దానికి దూరంగా జరుగుతూ మళ్లీ గోడ పట్టుకునేందుకు గోడపై చెతులు పెట్టగా, ఈ సారి కోపంతో పిల్లి చిన్నారిని చేతులను తన కాలితో తోసేసింది. ఎంతకి ఆ బాలుడు వినకపోవడంతో గోడపై నుంచి కిందకు దిగి అస్సలు గోడ పట్టుకోకుండ ఆ బుడ్డుకి అడ్డుగా నిలబడింది. జంతువులు సైతం విశ్వాసంగా ఉంటాయని నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ.. పిల్లి చేసిన పనిని శభాష్‌ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version