వీడి క్రియేటివిటీ తగలెయ్య….నదిలోకి అమ్మాయిని నెట్టిసి ఫోటో షూట్‌..వీడియో వైరల్‌

-

ఫ్రీ వెడ్డింగ్ ఫోటో/వీడియో షూట్ కోసం ఈ రోజుల్లో ప్రతి పెళ్లి కాబోయే జంట ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ థీమ్స్ తో ఈ షూట్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే షూట్ కోసం కొన్ని ముందస్తు కసరత్తులు చేసుకుంటే జీవితాంతం గుర్తుండిపోయే చక్కని వీడియో, ఫోటోలు మీ దగ్గర ఉంటాయి. ఫోటోషూట్ అంటేనే కొత్తగా అనిపించొచ్చు. పెళ్లికి ముందు ఇది తప్పనిసరి వేడుక అయిపోయింది ఇప్పుడు.

పక్కా ప్రణాళికతో ప్రతిదీ ముందుగానే సిద్ధం చేసుకుంటూ ఎలాంటి సమస్యలు లేకుండా, హాయిగా షూట్ పూర్తి చేసుకోవచ్చు. అయితే.. ఈ మధ్య కాలంలో ఫ్రీ వెడ్డింగ్ ఫోటో/వీడియో షూట్ పేరుతో చాలా సాహసాలు చేస్తున్నారు. బురదలో దొల్లడం, నీళ్లల్లో మునగడం ఇలా ఎన్నో రకాలుగా, ఫ్రీ వెడ్డింగ్ ఫోటో/వీడియో షూట్ చేస్తున్నారు. అయితే… తాజాగా ఓ జంట అచ్చం ఇలాగే… ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌ లో పాల్గొంది. పెళ్లి కొడుకు.. కాబోయే పెళ్లి కూతురును నదిలోకి తొసేస్తాడు. ఆ అమ్మాయి అందులో పడుతూ.. ఫోజులు ఇవ్వాలి. అలా ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌ నిర్వహించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version