ఈ సృష్టిలో మనిషికి జన్మనివ్వడం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే సాధ్యమైన విషయం. అబ్బాయిలు పిల్లలు కనడం గురించి మనం ఫన్నీగా మాట్లాడుకుంటాం కానీ అలా జరిగినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా..? నాగ్‌పూర్‌లో(Nagpur) నివసించే ఓ వ్యక్తి కడుపులో ఎవరూ ఊహించనిది బయటపడింది. అతను ఇద్దరు కవలలకు జన్మనిచ్చాడు. షాక్‌అయ్యారా..? నిజమే..! ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నాగ్‌పూర్ నివాసి సంజు భగత్ కవలలకు జన్మనిచ్చాడు. ఇతను 1963లో నాగ్‌పూర్‌లో జన్మించాడు. చిన్నతనంలో భగత్ బాల్యాన్ని చాలా హాయిగా గడిపాడు, కానీ అతని కడుపు సాధారణ పిల్లల కంటే కొంచెం ఎక్కువగా ఉబ్బింది. అతను ఈ వాపును ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు, కానీ క్రమంగా అది పెరగడంతో కుటుంబ సభ్యులు దాని గురించి ఆందోళన చెందడం ప్రారంభించారు.మొట్టమొదట, ఉబ్బిన కడుపుని చూడగానే భగత్‌కి వింతగా అనిపించేది, కానీ 1999 నాటికి, అది చాలా ఉబ్బిపోయింది, అతనికి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది అనిపించిందట. ఆఖరికి ఒకరోజు హాస్పిటల్‌లో అడ్మిట్ కాగా డాక్టర్లకు ట్యూమర్ సమస్య ఉందని ఆపరేషన్ చేద్దాం అనుకున్నారు. భగత్ కడుపుని తెరిచినప్పుడు అతను లోపలి దృశ్యాన్ని చూసి డాక్టర్లంతా ఆశ్చర్యపోయారు.
కడపులో కవలలు
భగత్ కడుపులో మనిషిని పోలిన ఆకృతిని డాక్టర్లు చూశారు. లోపల చేయి వేసేసరికి చాలా ఎముకలు కనిపించాయి. ఒక కాలు బయటకు వచ్చింది, మరొక కాలు బయటకు వచ్చింది, ఆపై కొన్ని ప్రైవేట్ భాగాలు, వెంట్రుకలు, చేతులు, దవడలు మరియు అన్నీ జతగా బయటకు వచ్చాయి. ఈ ఘటనతో వైద్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ కేసును వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అని డాక్టర్ పేర్కొన్నాడు, అంటే ఈ కవలలు గర్భధారణ సమయంలో తల్లి కడుపులో చనిపోయి ఉండాలి, కానీ పూర్తిగా చనిపోకపోవడంతో.. భగత్ డెలివరీ అయినప్పుడు తన పొట్టలోకి వచ్చేశారు. అక్కడ వారు పరాన్నజీవిలా అతనిని తింటున్నారు. ఇది చాలా విచిత్రం మరియు ఇది కోట్ల మందిలో ఒకరికి జరుగుతుందని వైద్యులు తెలిపారు.