పట్టా కావాలా? మొక్కలు నాటండి.. లేదంటే మీ చదువుకు పుల్‌స్టాపే?

-

ఫిలిప్పిన్స్‌లో ఉన్న అడవిలో ఇప్పటికే 70 శాతం నుంచి 20 శాతానికి తగ్గిందట. చెట్లను నరికేయడమే కానీ.. మొక్కలను నాటేవాళ్లే కరువయ్యారట ఆ దేశంలో. ఇది ఇలాగే ఇంకొన్ని రోజులు కొనసాగితే.. ఫిలిప్పిన్స్ దేశం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ముందే గ్రహించి… గ్రాడ్యుయేషన్ లెగసీ ఫర్ ది ఎన్విరాన్‌మెంట్ యాక్ట్ అనే బిల్లును హౌజ్‌లో పాస్ చేశారు.

టెన్త్ పాస్ అయ్యాక ఏం చేస్తాం? టెన్త్ పాస్ సర్టిఫికెట్ తీసుకొని.. ఇంటరో లేక డిప్లొమానో లేక ఇంకేదో చేస్తాం. ఇంటర్ పాస్ అయ్యాక.. ఇంటర్ సర్టిఫికెట్ తీసుకొని డిగ్రీనో లేక ఇంజినీరింగో.. మెడికలో ఏదో ఒకటి చేస్తాం అంటారా? అంతా బాగానే ఉంది కానీ.. మీరు కష్టపడి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యాక వెంటనే మీ సర్టిఫికెట్ మీ చేతుల్లో పడదు. అదేంటి పాస్ అయ్యాక కూడా సర్టిఫికెట్ ఇవ్వకుండా ఏం చేస్తారు? అనే డౌటనుమానం మీకు వచ్చి ఉండవచ్చు. కానీ.. మీరు కేవలం పరీక్షలు రాసినంత మాత్రాన… పాస్ అయినంత మాత్రాన మీకు ఇక నుంచి సర్టిఫికెట్లు రావు.

మీరు అదనంగా ఇంకో పని చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏమన్నా పరీక్షలు రాయాలా? అంటారా.. పరీక్షలు రాసేది లేదు.. కుస్తీ పట్టేది లేదు.. కానీ ఓ 10 మొక్కలు నాటాలి.. అంతే. ఆ పని చేస్తేనే మీ సర్టిఫికెట్లు మీ చేతుల్లో ఉంటాయి. లేదంటే మీ పై చదువులు గోవిందా? అయ్య బాబోయ్.. నిజమా? ఈ రూల్ ఎప్పుడొచ్చింది అంటారా? ఈ రూల్ ఇప్పుడే కొత్తగా వచ్చింది కానీ.. మన దగ్గర కాదు లేండి.. ఫిలిప్పిన్స్ అనే దేశంలో.

ఇంతకీ ఇంత కఠినమైన రూల్ ఎందుకు తీసుకొచ్చారంటారా? ఫిలిప్పిన్స్‌లో ఉన్న అడవిలో ఇప్పటికే 70 శాతం నుంచి 20 శాతానికి తగ్గిందట. చెట్లను నరికేయడమే కానీ.. మొక్కలను నాటేవాళ్లే కరువయ్యారట ఆ దేశంలో. ఇది ఇలాగే ఇంకొన్ని రోజులు కొనసాగితే.. ఫిలిప్పిన్స్ దేశం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ముందే గ్రహించి… గ్రాడ్యుయేషన్ లెగసీ ఫర్ ది ఎన్విరాన్‌మెంట్ యాక్ట్ అనే బిల్లును హౌజ్‌లో పాస్ చేశారు. ఆ లా ప్రకారం.. కాలేజీ, ఎలిమెంటరీ, హైస్కూల్ విద్యార్థులు తమ సర్టిఫికెట్ పొందాలంటే 10 మొక్కలు నాటాలి.

మొక్కలు ఎక్కడ నాటాలి.. ఏ మొక్కలు నాటాలి.. అనే విషయాలన్నీ కాలేజీలు చూసుకుంటాయి. వాళ్లు చెప్పిన ప్రాంతంలో మొక్కలు నాటితే చాలు. ఆ మొక్కలను పెంచే బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందట. ఒకవేళ ఈ రూల్ సరిగ్గా అమలు అయితే మాత్రం ఒక సంవత్సరంలో 17.5 కోట్ల మొక్కలను నాటే అవకాశం ఉంటుందట. వావ్.. సూపర్ కదా.. ఐడియా బాగుంది కదా.. మన దేశంలో కూడా ఇటువంటి ప్లాన్ స్టార్ట్ చేస్తే ఎలాగుంటది.. అబ్బబ్బో భలే గుంటది.

Read more RELATED
Recommended to you

Exit mobile version