సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. త్వ‌ర‌లో ఏపీఎఫ్‌డీసీ చైర్మ‌న్ ప‌ద‌వి కేటాయింపు..?

-

ఇటీవ‌లే ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా వ్యవహరించిన అంబికా కృష్ణ తన పదవికీ రాజీనామా చేయ‌గా, అటు రేపో మాపో టీటీడీ అధ్య‌క్ష ప‌ద‌వి కూడా ఖాళీ కానుంది. ఈ క్ర‌మంలో ఎపీఎఫ్‌డీసీ చైర్మ‌న్ ప‌ద‌విని సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ‌కు ఇస్తార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజారిటీతో వైకాపా అధికారంలోకి రాగా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ఇటీవ‌లే ప్ర‌మాణ స్వీకారం చేసి సీఎంగా బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆ రాష్ట్రంలోని వ్య‌వ‌స్థల ప్ర‌క్షాళ‌న దిశగా ప్ర‌స్తుతం అడుగులు వేస్తున్నారు. మ‌రోవైపు ఏపీ ఆర్థిక ప‌రిస్థితిని గాడిలో పెట్టేందుకు జ‌గ‌న్ ప్ర‌ణాళికాబ‌ద్దంగా ముందుకు సాగుతున్నారు. అయితే జ‌గన్ ఇంకా త‌న కేబినెట్‌ను ప్ర‌క‌టించ‌లేదు కానీ.. మ‌రోవైపు ఏపీలోని నామినేటెడ్ పోస్టుల‌కు మాత్రం నేత‌లు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో జ‌గ‌న్ సీఎం అయ్యాక నామినేటెడ్ ప‌ద‌వుల్లో కొన‌సాగుతున్న టీడీపీ నేత‌లు వ‌రుస‌గా రాజీనామాలు చేస్తున్న విష‌యం విదిత‌మే. అయితే స‌ద‌రు పోస్టుల‌కు గాను వైసీపీ వ‌ర్గాల్లో చాలా మంది నేత‌లు జ‌గ‌న్ వ‌ద్ద క్యూ క‌డుతున్నారు. ముఖ్యంగా ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన ప‌లువురు సినీ న‌టులు ఏపీలో ఉన్న ప‌లు నామినేటెడ్ పోస్టుల‌లో చేరేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు.

ఇటీవ‌లే ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా వ్యవహరించిన అంబికా కృష్ణ తన పదవికీ రాజీనామా చేయ‌గా, అటు రేపో మాపో టీటీడీ అధ్య‌క్ష ప‌ద‌వి కూడా ఖాళీ కానుంది. ఈ క్ర‌మంలో ఎపీఎఫ్‌డీసీ చైర్మ‌న్ ప‌ద‌విని సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ‌కు ఇస్తార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. సినీ ఇండ‌స్ట్రీలో జ‌య‌సుధ‌కు చాలా మందితో స‌త్సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆ ప‌ద‌వికి ఆమె అయితేనే క‌రెక్ట్ అని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో జ‌య‌సుధ‌కు ఎపీఎఫ్‌డీసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం సినీ న‌టుడు మోహ‌న్‌బాబు పోటీప‌డుతున్నారు. మ‌రి ఏ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుందో కొన్ని రోజులు ఓపిక ప‌డితే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version