పేదవాళ్ళు ధనవంతులుగా మారాలంటే మార్చుకోవాల్సిన లక్షణాలు..

-

పేద, ధనిక అన్న మాటలు రాగానే ఒక కొటేషన్ గుర్తుకు వస్తుంటుంది. పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదరికంలో చనిపోవడం మాత్రం నీ తప్పే అన్న మాటలు ఎంత పాపులరో చెప్పాల్సిన పనిలేదు. అది ముమ్మాటికీ నిజం కూడా. అట్టడుగున ఉన్న పేదవారు కూడా ఉన్నత స్థానాలకి ఎదిగినవారు ఉన్నారు. ఐతే అలా మారాలంటే ఏం చేయాలనేది ఈ రోజు తెలుసుకుందాం.

ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధనవంతులు అనగానే డబ్బు సంపాదించడమే అన్న కాన్సెప్ట్ కాబట్టి, డబ్బెలా సంపాదించాలన్న విషయాలే చర్చిద్దాం. కొంత మందికి ఎంత డబ్బున్నా సంతోషం ఉండదు కాబట్టి, వాళ్ళు నిజమైన పేదవాళ్ళుగా అభివర్ణింపబడతారు. కానీ ఇక్కడ మనం డబ్బెలా సంపాదించాలనే విషయమే మాట్లాడుకుంటున్నాం. సో అది పక్కన పెట్టి డబ్బు గురించే డిస్కస్ చేద్దాం.

ముందుగా సమయం విలువ తెలుసుకోవాలి.

టైమ్ వాల్యూ తెలియని వారు ధనవంతులు అవ్వలేరు. రోజులో మీరేం చేస్తున్నారో, దేనికి ఎంత టైమ్ కేటాయిస్తున్నారో తెలుసుకోకపోతే చాలా కష్టం. మీ టైమ్ అంతా మీకే ఉపయోగించుకోవాలి. అనవసరమైన వాటికి ఉపయోగించి కాలాన్ని వృధా చేసుకోవద్దు.

ఆర్థిక అవసరాలు

నెల మొత్తంలో మీ అవసరాలు ఏంటి, దానికి ఎంత ఖర్చు చేయాలి. ఇంకా కావాల్సిన అవసరాలు ఏం ఉన్నాయి? వాటికోసం ఇంకెంత సంపాదించాలి అనేది మీరే డిసైడ్ అవ్వాలి. ఆర్థిక ప్రణాళిక లేకపోతే దేనికి ఖర్చుపెడుతున్నారో అర్థం కాకుండా పోతుంది.

మీ అవసరాల కంటే ఎక్కువే సంపాదించండి. తక్కువ ఖర్చు పెట్టండి. దీనర్థం అవసరమైన వాటికి కూడా ఖర్చు పెట్టకపోవడం కాదు. కేవలం అవసరమున్న వాటికే ఖర్చు చేయాలని చెప్పడం. వస్తువుల మీద ఖర్చు చేయవద్దు. మీరు పెట్టే ప్రతీ రూపాయి ఎందుకు పెడుతున్నారనేది తెలియాలి. మీకు తెలియకుండా విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుందంటే మీ ఆర్థిక ప్రణాళికలో ఏదో లోపం ఉన్నట్టే.

Read more RELATED
Recommended to you

Latest news