భారతదేశంలో తాజా కరోనావైరస్ కేసులు భారీగా పెరిగాయి, ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ఉదయం 59,118 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం మొత్తం మీద ఇప్పటి దాకా 1,18,46,652 కరోనా కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో గత రెండు వారాలుగా ఈ కరోన కేసుల పెరుగుదల మళ్ళీ కనిపిస్తోంది. దీంతో మాస్క్ లు ధరించడం అలానే సామాజిక దూరాన్ని పాటించడం వంటి కోవిడ్ ప్రోటోకాల్ లకు కట్టుబడి ఉండాలని ప్రభుత్వం ప్రజలకి గుర్తు చేస్తూ వస్తోంది.
అక్టోబర్ 18న చివరిగా 61,871 కేసులు ఒకే రోజులో నమోదయ్యాయి. ఆ తరువాత మళ్ళీ అంత భారీగా నమోదు కావడం ఇదే మొదటి సరి. ఇక తాజా కేసులతో యాక్టివ్ కేసులు మరోసారి నాలుగు లక్షలు దాటాయి. ఈ యాక్టివ్ కేసులు 4,21,066 కు చేరుకున్నాయి. మహారాష్ట్ర గురువారం నాడు 35,992 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో అతిపెద్ద సింగిల్ డే స్పైక్‌ను నమోదు చేసిన ఇతర రాష్ట్రాలు పంజాబ్ (2,661), కర్ణాటక (2,523), ఛత్తీస్‌గ ్ (2,419), కేరళ (1,989).