స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్ళు అయినా ఇంకా ఆ రైల్వే లైన్ బ్రిటీష్ ఆధీనంలో ఉందని తెలుసా..?

-

మనకు స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా ఇంకా భారతదేశంలోని రైల్వే స్టేషన్ లో కొన్ని బ్రిటిష్ కంపెనీ ఆధీనంలో ఉన్నాయి. ఇండియన్ రైల్వే చాలాసార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. బ్రిటిష్ కంపెనీ కిల్లిక్ నిక్సన్ & కో ఇప్పటికీ సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీని నిర్వహిస్తోంది. ఈ సంస్థ అమరావతి నుంచి మహారాష్ట్రలోని ముర్తజాపూర్ దాకా 190 కి.మీ రైలు మార్గంలో శకుంతల ఎక్స్‌ప్రెస్‌ను నడిపేది. స్వాతంత్ర్యం వచ్చాక బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలేసారు. బ్రిటిష్ ప్రైవేట్ కంపెనీ ఈ మార్గంలో అధికారాన్ని కొనసాగిస్తోంది. ఆ కంపెనీకి భారతీయ రైల్వే రూ.1.20 కోట్ల రాయల్టీ చెల్లిస్తోందని నివేదికలు ద్వారా తెలుస్తోంది.

అమరావతి నుంచి ముర్తజాపూర్ వరకు 190km రైల్వే లైన్‌ను కొనుగోలు చేయడానికి భారతీయ రైల్వే అనేక ప్రయత్నాలు చేసింది. ఈ రైలు మార్గంలో శకుంతల ప్యాసింజర్ అనే ఒక ప్యాసింజర్ రైలు మాత్రమే రన్ అయ్యేది. కాబట్టి ఈ మార్గానికి శకుంతల రైల్వే లైన్ అని పేరు వచ్చింది. శకుంతల ఎక్స్‌ప్రెస్ అచల్పూర్ యావత్మాల్ మధ్య 17 స్టేషన్లలో ఆగేది. దాదాపు 70 ఏళ్ల పాటు స్టీమ్ ఇంజిన్‌తో నడిచింది.

1994లో శకుంతల ప్యాసింజర్ రైలుకు డీజిల్ ఇంజన్ ఏర్పాటు చేసారు. ఆ తర్వాత అనుకోని కారణాలతో రైలు నిలిచిపోయింది. పునఃప్రారంభించాలని స్థానికులు కోరారు. 5 బోగీలతో రైలు ప్రతి రోజు 800 నుంచి 1,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేది. భారతీయ రైల్వేలు 1951లో జాతీయం చేయబడ్డాయి. ఈ రైల్వే లైన్ భారత ప్రభుత్వ పరిధిలోకి రాలేదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version