దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కువగా రైలు ప్రయాణాలను ఎంచుకుంటారు..సేఫ్ గా,సులువుగా కుటుంబం మొత్తం వెల్లొచ్చు..రవాణా వ్యవస్థలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రోడ్లు, విమాన సదుపాయాలతో పాటు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చేందుకు దేశ వ్యాప్తంగా చాలా రైలు సర్వీసులు నడుస్తున్నాయి.. రైల్వేలకు పెరుగుతున్న ఆదరణ కారణంగా ప్యాసింజర్స్ కు రైల్వే క్రమంగా ప్రయాణీకులకు అందించే సౌకర్యాలను పెంచుతోంది. శుభ్రత నుంచి ప్యాంట్రీ కార్ వరకు ఉన్నాయి. అయితే, రైళ్లలో లభించే ఆహార పదార్థాల్లో ఇప్పటికీ మార్పు రావడం లేదు. స్టేషన్లలో అమ్మే తినుబండారాల నుంచి రైళ్లల్లో అందించే భోజన సదుపాయాల వరకు ఎందులోనూ మార్పులు లేవు..
ఈ పరిస్థితుల కారణంగా రైళ్లలో లభించే ఆహార పదార్థాల పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. ఇందుకు ఓ ఎగ్జాంపుల్ గా చెప్పుకునేందుకు ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక ప్రయాణికుడు తాను కొనుగోలు చేసిన ఆహారం విషయంలో ఖంగు తిన్నాడు..రైలు నంబర్ 20291 బాంద్రా – లక్నో రైలులో అక్టోబర్ 9 న లక్నో వెళ్తున్నాడు. అప్పుడు అతను IRCTC ప్యాంట్రీ నుంచి సమోసాను కొనుగోలు చేశాడు. కానీ కొంత సమోసాను తిన్న తర్వాత దానిలో పసుపు రంగులో ఉన్న ప్యాకెట్ కనిపించింది. దీంతో షాక్ అయిన అజిత్.. ఐఆర్‌సీటీసీ కి కంప్లైంట్ చేశాడు. ప్యాంట్రీ ద్వారా పరిశుభ్రమైన ఆహారం సరఫరా అవుతోందని వ్యంగ్యంగా కంప్లైంట్ చేశారు.
అయితే.. ప్రయాణీకుడు ట్వీట్ చేసిన వెంటనే అతనికి IRCTC నుంచి సమాధానం వచ్చింది..సార్, అసౌకర్యానికి క్షమించండి. దయచేసి పీఎస్ఆర్, మొబైల్ నంబర్‌ను డీఎమ్ లో షేర్ చేయాలని సూచించారు. కాగా.. ఐఆర్సీటీసీ ఇచ్చిన సమాధానంతో ప్రజలు అంసతృప్తికి గురయ్యారు..మొత్తానికి ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది..
This Samosa served IRCTC pantry provided in Train No. 20921 Bandra bound Lucknow weekly exp. started on 8-10-22..i bought it 9-10-22 morning around 10:15 AM…. I salute IRCTC for the foods serving to the passengers… pic.twitter.com/2ugoUzSmoU
— Aji Kumar (@AjiKuma41136391) October 9, 2022