ఈ ఫోటోలో ఉన్నది ఆకు కాదు..పెద్ద స్టోరీనే ఉంది..

-

కళ్ళను మోసం చేసే విధంగా కొన్ని పురుగులు ఉండటం మనం చూస్తూనే ఉంటాము..అవి చూడటానికి అచ్చం ఆకులు మాదిరిగానే ఉంటాయి. వాటిని చూడగానే పట్టుకోవాలని అనుకుంటారు. అయితే అందులో కొన్ని ముట్టుకుంటే విషాన్ని కక్కేవి కూడా ఉంటాయి.అలాంటి వాటిని ఎక్కువగా వర్షాకాలంలో చూస్తాము. ముఖ్యంగా అడవుల్లో,సముద్రాలలో కొన్నిసార్లు చిత్రమైన జీవులు చూస్తుంటాం. ముఖ్యంగా సముద్రంలో ఉంటే విచిత్రమైన చేపలు, జీవులు అట్లుపోట్లు సంభవించే ప్రాంతంలో కనిపిస్తుంటాయి.

ఇది ఇలా ఉండగా తాజాగా రాలిన ఆకు లాంటి శరీరం ఉన్న అరుదైన జీవి విశాఖ తీరంలో కనిపించింది. అత్యంత అరుదైన ‘ఫ్లాట్‌వార్మ్‌’ జాడ విశాఖలో తొలిసారిగా వెలుగు చూసింది. రక్తనాళాలు లేని ఈ జీవి లేత, ముదురు నీలి రంగు, మధ్యలో పొడవైన పసుపురంగు వెన్నుతో కనువిందు చేస్తోంది.. అటుపోట్లు వచ్చే ప్రాంతంలో అరుదైన జాతులు/ జీవులపై పరిశోధనలు చేస్తున్నారు విశాఖకు చెందిన ఈస్ట్‌కోస్ట్‌ కన్జర్వేషన్‌ టీమ్‌ సభ్యులు. వైజాగ్‌ తీరంలో ప్రతి రెండు వారాలకు మెరైన్‌ వాక్‌ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఫ్లాట్‌వార్మ్‌ గురించి ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ రీసెర్చ్‌ థాట్‌ గత నెలలో ఈ విషయంపై ప్రచురించింది..

మెరైన్ బయాలజిస్టు శ్రీచక్ర ప్రణవ్‌ నేతృత్వంలోని విమల్‌రాజ్, మనీష్‌ మానిక్, పవన్‌సాయిలు ఈ ఫ్లాట్‌వార్మ్‌ను గుర్తించి రికార్డు చేశారు. ఈ ఫ్లాట్‌వార్మ్‌లు విషపూరితాలు. వీటికున్న రంగుల ద్వారా ఇతర జంతువులు వాటిని విషపూరితాలుగా గుర్తించి దగ్గరకు రానీయవు.. అలాగే అదేదో వింత అని దగ్గరకు వెళ్లవు.. అలా అవి తమ జాతిని వృద్ధి చేస్తున్నాయి..ఇవి చిన్న చిన్న పీతలను, చిన్న పురుగులను ఆహారంగా తీసుకుంటాయి.. మొత్తానికి బీచ్ దగ్గర ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version